Political Parties’ Support Needed for Error-Free Voter List
పొరపాటుల్లేని తుది ఓటరు జాబితా జిల్లా కలెక్టర్
భూపాలపల్లి నేటిధాత్రి
పొరపాటుల్లేని తుది ఓటరు జాబితా రూపకల్పనకు రాజకీయ పార్టీల సహకారం అవసరమని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు.
మంగళవారం ఐడిఓసి కార్యాలయంలో పురపాలక తుది ఓటరు జాబితా రూపకల్పనపై అన్ని గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓటరు జాబితా స్వచ్ఛత ఖచ్చితత్వం ప్రజాస్వామ్యానికి కీలకమని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరి పేరు జాబితాలో ఉండేలా, అర్హత లేని పేర్లు తొలగించే ప్రక్రియలో రాజకీయ పార్టీలు నిర్మాణాత్మక సూచనలు ఇవ్వాలని కోరారు. ఓటరు నమోదు, మార్పులు, తొలగింపులపై అభ్యంతరాలు ఉంటే నిర్ణీత గడువులో సమర్పించాలని, ఫీల్డ్ స్థాయిలో విచారణ నిర్వహించి తగు చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు.
ఈ సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, మున్సిపల్ కమిషనర్ ఉదయ్ కుమార్, టీపీఓ సునీల్, గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులు, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
