రక్త దాతలే ప్రాణ దాతలు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి

# ఓటు హక్కు కలిగిన ప్రతి ఓటరు ఎన్నికల్లో ఓటు ను వినియోగించుకోవాలి

# స్వీప్ కార్యక్రమములో భాగంగా జిల్లా గ్రామీణభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం

# స్వచ్ఛందంగా ఉస్సహంగా పాల్గొన్న అధికారులు ఉద్యోగులు యువకులు

ములుగు జిల్లా నేటిధాత్రి

ములుగు స్వీప్ జిల్లా గ్రామీణభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో జిల్లా పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ప్రారంభించారు ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ నేడు రక్త దానం చేసిన రక్తదాతలే ప్రాణ దాతలని రక్తం దానం చేయడం ద్వారా ఒక కుటుంబాన్ని ఆదుకున్నవారు ఔతారని ఆపద సమయంలో కూడా రక్తదానం చేయడానికి ముందుకు రావాలని అన్నారు. స్వీప్ కార్యక్రమములో భాగంగా జిల్లా గ్రామీణభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో పార్లమెంట్ లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో పోలింగ్ శాతం పెంపొందించడానికి వినూత్నంగా జిల్లా కేంద్రములో రక్తదాన శిబిరం నిర్వహించడం జరిగిందని, సేకరించిన రక్తాన్ని రెడ్ క్రాస్ ద్వారా వివిధ ప్రాంతాలలో తలసేమియావ్యాధితో బాధపడుతున్న చిన్నారులకు అందించడం జరుగుతుందని తెలిపారు పార్లమెంట్ లోక్ సభ ఎన్నికలలో ఇదే స్ఫూర్తితో అధికారులు, ఉద్యోగులు యువకులు, ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరిని తమ ఓటును ఉపయోగించుకునే విధంగా వారికి అవగాహన కల్పించి ఓటింగ్ శాతం పెంచే విధంగా ప్రయత్నం చేయాలని సూచించారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ఎంతో కీలకమని ఓటింగ్ ద్వారానే మంచి ప్రభుత్వాన్ని ఎంచుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు మే 13వ తేదీన జరిగే పోలింగ్ లో అందరూ తమ ఓటు హక్కును వినియోగించుకుని ఎక్కువ పోలింగ్ శాతం నమోదు అయిన జిల్లాగా రికార్డ్ సృష్టించేందుకు ప్రయత్నిస్తూ ఇతర జిల్లాలోని ఓటర్లకు స్ఫూర్తిగా నిలవాలని పేర్కొన్నారు. ఎన్నికల్లో ఓటు వేయడమే కాకుండా తమ చుట్టుపక్కల ఉన్న ఓటర్లు ఓటు వేసేలా కృషి చేయాలన్నారు పోలింగ్ కేంద్రాల్లో వేసవి దృష్ట్యా తాగునీరు, ఓఆర్ఎస్ ప్యాకెట్లతో పాటు మిగతా సౌకర్యాలను కల్పిస్తున్నట్లు కలెక్టర్ పేర్కొన్నారు. ప్రతి రెండు కిలోమీటర్ల దూరంలోపు పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. విద్యార్థులు యువత ప్రజాస్వామ్యానికి అంబాసిడర్లు రాయబారులు గా పనిచేసి ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు తమ వంతు కృషి చేయాలన్నారు.తల్లిదండ్రులే కాకుండా తమ చుట్టుపక్కల ఉన్న ఓటర్లు ఎన్నికల్లో ఓటు వేసేవిధంగా యువత చైతన్యవంతం చేయాలన్నారు. ప్రజాస్వామ్యానికి మూలాధారమైన ఓటును ఎన్నికల్లో ఓటర్లు వినియోగించుకోవాలని కోరారు ఈ సందర్భంగా జిల్లా స్వీప్ నోడల్ అధికారి డి ఆర్ డి ఎ శ్రీనివాస్ కుమార్ 55 సారి రక్తాన్ని దానం చేసిన నందుకు కలెక్టర్ ప్రత్యేకంగా అభినందించారు ఈ శిబిరం లో పాల్గొనడానికి స్వచ్ఛందంగా ముందుకు వచ్చి పాల్గొన్న అధికారులకు ఉద్యోగులకు, యువకులకు మహిళలకు కలెక్టర్ అభినందించారు ఈ రక్తదాన శిబిరం లో మొత్తం 174 మంది రక్తాన్ని అందించారు ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రెవిన్యూ సిహెచ్ మహేందర్ జి ఎస్ సి కార్పొరేషన్ ఈ డి తుల రవి , పంచాయతి రాజ్ ఈ ఈ అజయ్ కుమార్, డి పి ఆర్ ఓ ఏం డి రఫిక్, జిల్లా మైనారిటీ అధికారిని ప్రేమలత, జిల్లా సంక్షేమ అధికారిని స్వర్ణలత లెనిన జిల్లా వ్యవసాయ అధికారి విజయ చంద్ర, డి పి యమ్ సతీష్ ఏ పి డి ఈ జి ఎస్ వెంకటనారాయణ ఇతర అధికారులు, ఉద్యోగులు యువకులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!