చిట్యాల, నేటిధాత్రి :
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో సంగ్రాణాత్మక మూల్యాంకనము – ఎస్ ఏ -1) చిట్యాల మండలంలోని వివేకానంద హై స్కూల్ ఓడితల పరీక్ష కేంద్రమును జిల్లా ఉమ్మడి పరీక్షల బోర్డ్ అసిస్టెంట్ కార్యదర్శి శనిగరపు భద్రయ్య పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ విద్యార్థులు భయం లేకుండా సంకోచించకుండా పరీక్షలు రాయాలని. ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు విద్యార్థులకు పరీక్షలు అంటే భయం కల్పించకుండా ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాసే విధంగా చూడాలని.పరీక్షలు అయిన వెంటనే మూల్యాంకనం చేయాలని మార్కులను రిజిస్టర్ నందు నమోదు చేయాలని ఉపాధ్యాయులకు పలు సూచనలు చేశారు. వీరి వెంట పాఠశాల యజమాన్యం సతీష్. శ్రీధర్ ఉపాధ్యాయులు ఉన్నారు.