
మహిళలకు బహుమతులు అందజేసిన డిపో మేనేజర్ రవీందర్
పరకాల నేటిధాత్రి
తెలంగాణ ఆర్టీసీ ప్రవేశపెట్టిన డీలక్స్ బస్సులో ప్రయాణించే మహిళ ప్యాసింజర్ లకు బహుమతులు ప్రధానం చేస్తున్న పథకంలో భాగముగా శుక్రవారం రోజున తెలంగాణ ఆర్టీసీ పరకాల డిపో వారు డీలక్స్ బస్సులో ప్రయాణించిన మహిళ ప్రయాణికులకు పరకాల బస్టాండ్ ఆవరణలో డిపో మేనేజర్ రవిచందర్ అసిస్టెంట్ మేనేజర్ కృష్ణకుమారి చేతుల మీదుగా ముగ్గురు ప్రయాణికులు బహుమతులు ప్రధానం చేశారు.మొదటి బహుమతి
గంజ పద్మ,రెండవ బహుమతి,పూజారి అరుణ,మూడవ బహుమతి మమతలకు లక్కీ డ్రా ద్వారా ఎంపిక చేసి బహుమతులు అందజేశారు.ఈ సందర్భంగా డీఎం రవిచందర్ మాట్లాడుతూ మహిళ ప్రయాణికులు అధిక సంఖ్యలో డీలక్స్ బస్సులో ప్రయాణించి టికెట్ వెనకవైపు వారి వివరాలు వ్రాసి బస్సులో ఉన్న లక్కి డిప్ బాక్స్ లో వేసి బహుమతులు గెలుచుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ప్రయాణికులు పాల్గొన్నారు.