నేటిధాత్రి, కాశీబుగ్గ
వరంగల్ కాశీబుగ్గ లోని లక్ష్మీగణపతి సహకార పరపతి సంఘం ఆధ్వర్యంలో కాశిబుగ్గ చౌరస్తాలో సంక్రాంతి పండుగ సందర్భంగా ఉచితంగా పతంగుల పంపిణీ కార్యక్రమాన్ని చిన్నపిల్లలకు పంచడం జరిగినది. అధ్యక్షులు వంగరి రాంప్రసాద్ మాట్లాడుతూ గత తొమ్మిది సంవత్సరాలుగా పతంగుల పంపిణీ, చలివేంద్రం, ఆధ్యాత్మిక, సాంస్కృతిక, సేవా కార్యక్రమలు సంఘం తరఫున చేపడుతున్నామని తెలపడం జరిగినది. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి మండల సురేష్, ఉపాధ్యక్షులు వేముల నాగరాజు, దాసి శివకృష్ణ , కోశాధికారి దుస్సా కృష్ణ, పసునూటి శ్రీకాంత్, మండల చంద్రశేఖర్, మామిడాల సతీష్, బండారి లక్ష్మణ్, గాదె జగన్, వంగరి రవి, గోనె సతీష్, వంగ ఐలయ్య , కూచన సతీష్, గుండా యుగేందర్, కూరపాటి సతీష్, తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.