జమ్మికుంట: నేటి ధాత్రి
స్వేచ్చతాహి సేవ పక్షోత్సవాల సందర్భంగా గ్రామపంచాయతీ కార్మికులకు హెల్త్ కార్డులను అందజేశారు. ఇల్లందకుంట మండల కేంద్రంలోని రైతు వేదికలో ఏర్పాటు చేసిన స్వేచ్ఛ తాహి సేవా కార్యక్రమంలో భాగంగా ఎంపీడీవో పుల్లయ్య ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో మండలంలోని 18 గ్రామ పంచాయతీల కార్మికులు హాజరయ్యారు .ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ పల్లెలు దేశానికి పట్టుకొమ్మలాగా ఉంటాయని పల్లెలు బాగుంటేనే దేశం బాగుంటుందని, ప్రతి గ్రామంలో పారిశుద్ధ కార్మికుడు బాగుంటేనే ఆ గ్రామం బాగుంటుందన్నారు. గ్రామపంచాయతీ కార్మికుడు మురికి చెత్త చెదారంలో పనిచేసే గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచడంలో ముందు ఉంటాడని అలాంటి కార్మికునికి ప్రభుత్వం గుర్తించి హెల్త్ కార్డులను అందజేస్తుందన్నారు. పంచాయతీ కార్మికునికి ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉన్న మండల కేంద్రంలోని పీహెచ్సీ సెంటర్లో వైద్య సేవలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో పుల్లయ్య ,టిహెచ్సి డాక్టర్ తులసీదాస్ ,ఎంపీ ఓ రాజేశ్వరరావు, డాక్టర్ కళ్యాణ్ తో పాటు గ్రామపంచాయతీ కార్యదర్శులు కార్మికులు పాల్గొన్నారు.