
విద్యార్థులు ఉన్నత స్థాయికి ఎదగాలి-ఎన్ ఆర్ ఐ భావన
నడికూడ,నేటి ధాత్రి:మండలంలోని చర్లపల్లి ప్రాథమిక పాఠశాలలోని విద్యార్థినీ,విద్యార్థులకు రాగి జావ త్రాగడానికి స్టీల్ గ్లాసులు పంపిణీ చేశారు. అమెరికాలో డాటా సైంటిస్ట్ గా పని చేస్తున్న తాడూరి మిధున్ జన్మదినం సందర్భంగా ఆయన సతీమణి భావన వచ్చి పాఠశాలలో చదువుతున్న 84 మంది విద్యార్థులకు రాగి జావా త్రాగడానికి స్టీల్ గ్లాసులు అందజేశారు. అనంతరం భావన మాట్లాడుతూ విద్యార్థులు ఉపాధ్యాయులు చెప్పే పాఠాలు శ్రద్ధగా, విని బాగా కష్టపడి చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని అన్నారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు అచ్చ సుదర్శన్, ఉపాధ్యాయులు పోలంపల్లి విజేందర్,నిగ్గుల శ్రీదేవి మిధున్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, వారి దంపతులకు ఉపాధ్యాయుల, విద్యార్థుల పక్షాన కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో విద్యా వాలంటీర్ జ్యోతి, ఐఆర్పి రమేష్, అంగన్వాడి టీచర్ సంధ్య, భీముడు లక్ష్మి మరియు విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు.