లయన్స్ క్లబ్ సహాకారంతో పాఠశాలల విద్యార్థులకు పరీక్షల సామాగ్రి పంపిణీ

ఎండపల్లి, నేటిధాత్రి
లయన్స్ క్లబ్ సహాకారంతో పాఠశాలల విద్యార్థులకు పరీక్షల సామాగ్రి పంపిణీ చేశారులయన్స్ క్లబ్ ఆఫ్ రాజారాంపల్లి సహాకారంతో లయన్ రావికంటి తిరుపతి రామ్ రాజ్ కాటన్ షోరూం కరీంనగర్ వారి సహాయంతో శుక్రవారం ఎండపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఎండపల్లి, కొత్తపేట పాఠశాలల్లో విద్యనభ్యసిస్తున్న పదవ తరగతి విద్యార్థులకు ఎగ్జామ్ ప్యాడ్స్, చేతి రుమాలులు అలాగే ప్రాథమిక పాఠశాల విద్యార్థిని,విద్యార్థులకు చేతి రుమాలులు, కంపాక్స్ బాక్సులు పంపిణీ చేశారు. మూడు పాఠశాలల్లో సుమారుగా నాలుగు వందల కు పైగా చేతి రుమాలులు పంపిణీ చేయడం జరిగిందని లయన్స్ క్లబ్ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ రాజారాం పల్లి అధ్యక్షుడు కే సత్యనారాయణ రావు, కోశాధికారి లయన్ టీవీ రమణా రెడ్డి,కె. రాంబాబు, పి ఆర్ ఓ బి. మురళి, జి.నంది రెడ్డి,కుంట మల్లారెడ్డి లతోపాటు వివిధ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, అధ్యాపక బృందం, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!