భద్రాచలం నేటి ధాత్రి
భద్రాచలం:- జర్నలిస్ట్ ఫోరం ఆఫ్ భద్రాద్రి ప్రెస్ క్లబ్ వారికి ఐ టిసి పి ఎస్ పి డి వారు అందించిన డైరీలు స్వీట్స్ గౌరవ అధ్యక్షులు అల్లాడి వెంకటేశ్వరావు, క్లబ్ అధ్యక్షులు బొడ్డు ఆనందు, లీగల్ అడ్వైసెర్ ప్రముఖ హైకోర్టు న్యాయవాది మల్లా సత్యనారాయణ వారి చేతులమీదుగా సభ్యులకు అందించారు..అనంతరం, అల్లాడి, బొడ్డు ఆనంద్ మాట్లాడుతూ,ప్రభుత్వానికి,ప్రజలకు వారధిగా ఉండి పేరుక పోయిన సమస్యల పరిస్కారానికి కృషి చేస్తున్న జర్నలిస్టులు అంకితభావంతో పనిచేయాలనిఅన్నారు..పాత్రికేయుల వృత్తికి ఎటువంటి మచ్చ తేకుండ ఉండాలని, భవిష్యత్ లో క్లబ్ బలోపేతానికి సభ్యులందరు సహకరించాలని,ప్రతిసభ్యుడు వార్తల సేకరణ లో నిజాన్ని నిర్భయంగా వాస్తావాలను వ్రాయాలని, సూచించారు… ఈకార్యక్రమంలో కామఅనిల్,మాదార్, సుధాకర్, రమేష్, ఎస్ కె హ మద్, అంజి, రాజా, శ్వేతా, వేణు, సునీల్, తదితరులు పాల్గొన్నారు….