
నూజివీడు ఆర్గనైజర్: చొప్పరి తిరుపతి..
వీణవంక,( కరీంనగర్ జిల్లా)
నేటి ధాత్రి:వీణవంక మండల పరిధిలోని బేతిగల్ గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులకు నూజివీడు కంపెనీ వారు 6 కంప్యూటర్లు పాఠశాలకు అందజేశారు. వీణవంక మండలంలోని ప్రభుత్వ పాఠశాలలో కంప్యూటర్ల పంపిణీలో నూజివీడు కంపెనీ ఆఫీసర్లు గూడె శ్రీనివాసరావు డీజీఎం, సంజయ్ కులకర్ణి డిజీఎం, జగదీష్ డిజిఎం, దూడపాక రవి జూనియర్ మేనేజర్ నూజివీడు ఆర్గనైజర్ చొప్పరి తిరుపతి బేతిగల్ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు పంపిణీ చేస్తూ అనంతరం వారు మాట్లాడుతూ… మారుతున్న కాలానికి అనుకూలంగా కంప్యూటర్ విద్య అవసరమని విద్య రంగం డిజిటల్ విద్యావైపు నడుస్తున్న తరుణంలో సాంకేతిక పరిజ్ఞాన విద్యను విద్యార్థులకు అందించి దిశగా నూజివీడు కంపెనీ ప్రపంచ స్థాయిలో ముందు వరుసలో నిలుస్తుందని అలాగే విద్యార్థులు కూడా కంప్యూటర్ విద్యలో ఆరి తీరాలనే ఉద్దేశంతో వీణవంక మండలంలోని ప్రభుత్వ పాఠశాలలో 26 కంప్యూటర్లను అందజేయడం జరిగింది . పాఠశాలకు కంప్యూటర్లు బహుకరించినందుకు పాఠశాల ప్రధానోపాధ్యాయులు దూడం రాజమల్లు కంపెనీ అధికారులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం కంపెనీ అధికారులను శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో నూజివీడు కంపెనీ ప్రతినిధులతో పాటుగా గ్రామ పెద్దలు మాసాడి మాధవరావు, మాజీ సర్పంచ్ గొట్టుముక్కల సంపత్ రావు,చొప్పరి సారయ్య, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.