గ్రామంలో సిఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ…
తంగళ్ళపల్లి నేటి ధాత్రి:
తంగళ్ళపల్లి మండలం గోపాలరావుపల్లి గ్రామంలో ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కలు పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ. రాష్ట్రంలోని పేద ప్రజలకు వైద్యం చేయించుకుని పరిస్థితులు ఉన్నవారికి కార్పొరేట్ స్థాయి ఉచిత వైద్య సాయం అందించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలియజేస్తూ. పేద ప్రజలకు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ ప్రజలకు అన్ని రకాల సంక్షేమ పథకాలు తీసుకొచ్చి రాష్ట్రాన్ని ముందంజలో ఉంచుతున్నారని తెలియజేశారు. ఇట్టి చెక్కులను. కాంగ్రెస్ పార్టీ నాయకుల చేతుల మీదుగా అందజేశారు ఇందులో లబ్ధిదారులైన. అంబటి లక్ష్మమ్మకు 60000 రూపాయలు. మునిగే మహేందర్ కు 55 వేల రూపాయలు. బి మల్లయ్యకు. 11,500 రూపాయలు. చెక్కులు పంపిణీ చేయడం జరిగింది. ఇట్టి చెక్కులు రావడానికి కృషిచేసిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కి. సిరిసిల్ల నియోజకవర్గం ఇన్చార్జి కేకే మహేందర్ రెడ్డి కి మండల అధ్యక్షులు ప్రవీణ్ కి. ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ మాకు చెక్కులు రావడానికి కృషి చేసినందుకు లబ్ధిదారులందరూ ధన్యవాదాలు తెలిపారు ఇట్టి కార్యక్రమంలో గ్రామ శాఖ అధ్యక్షులు కడారి సునీల్ రెడ్డి. సీనియర్ నాయకులు కూతురి రాజు. కుండ వేణి కిషన్. రవి. మీరాల శ్రీనివాస్ యాదవ్. ఎడ్ల ప్రేమ్ కుమార్. జంగం సత్తయ్య. కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు