బయమ్మపల్లి గ్రామ పంచాయితీ కి బ్లీచింగ్ పౌడర్ మరియి బల్బ్ లు హోల్డర్స్ వితరణ

కార్యదర్శుల కు సన్మానం కార్యక్రమం…

ఓదెల(పెద్దపల్లి జిల్లా)నేటిధాత్రి:

ఓదెల మండలం బాయమ్మపల్లె గ్రామ పంచాయితీ కి యాదవ సంఘం మండల అధ్యక్షులు కావటి రాజు యాదవ్ బ్లీచింగ్ పౌడర్,బల్బులు,హోల్డర్ లు అందజేశారు.
ఈ సందర్బంగా రాజుయాదవ్ మాట్లాడుతూ గ్రామంలో ని ప్రజలు కొందరు విడిదిపాలు వెలగడం లేదని చీకట్లో ఇబ్బందులు పడుతున్నామని మరియు బావులలో బ్లీచింగ్ పౌడర్ చేయడం లేదని తన దృష్టికి తీసుకు రాగ స్పందించి వెంటనే 2 బ్లీచింగ్ పౌడర్ బాగ్స్ మరియు 50 బల్బులు మరియు 20 ఓల్డర్స్ గ్రామ పంచాయతి కార్యదర్శి శ్రీను యాదవ్ కు సుమారు పది వేల రూపాయల విలువ గల సామాగ్రిని అందజేయడం జరిగినది ఈ మరియు ప్రజలందరూ ఈ సీజన్ లో కాచి చల్లార్చిన నీరు త్రాగాలని ఇంటిని ఇంటి ఆవరణ పరిశుభ్రంగా ఉంచుకోవాలని ముక్యంగా నీరు నిల్వ లేకుండా చూసుకోవాలని పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం మన అందరి బాధ్యత అని తెలిపారు. ఈ సందర్బంగా పంచాయతీ కార్యదర్శి శ్రీనుయాదవ్ మాట్లాడుతూ మా గ్రామ పంచాయతీ కి సామాగ్రి అందించినందుకు కావటి రాజుయాదవ్ కు మా గ్రామ ప్రజల తరుపున మరియు గ్రామపంచాయతీ తరుపున ప్రత్యేక కృతజ్ఞతలు ధన్యవాదములు తెలియజేయడం జరిగింది.అదే విధంగా యాదవ సంగం మండల అధ్యక్షులు కావటి రాజు యాదవ్ ఆధ్వర్యంలో గతంలో బయమ్మపల్లి పంచాయతీ కార్యదర్శి గా పనిచేసి బదిలీపై వెళ్లిన బానుప్రసాద్ కు వీడ్కోలు పలుకుతూ మరియు నూతనంగా బయమ్మపల్లి కి కార్యదర్శి గా వచ్చిన శ్రీనుయాదవ్ ను అదేవిదంగా నూతనంగా ఇందుర్తి కార్యదర్శి గా వచ్చిన వేణు గారికి స్వాగతం పలుకుతూ సన్మాన కార్యక్రమం రాజుయాదవ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమం లో యాదవ సంగమ్ మండల అధ్యక్షులు కావటి రాజుయాదవ్ మాజీ సర్పంచ్ లు తెలుసురి కొమురయ్య యాదవ్,పడాల రాజు, పంచాయతీ కార్యదర్శులు బానుప్రసాద్, శ్రీనుయాదవ్, వేణు, కారోబార్ బకరాపు కుమారస్వామి యాదవ్ మరియు సుబ్సెంటర్ మెడికల్ ఆఫీసర్ సృజనా ఏ ఎన్ ఎం మాధవి మరియు నాయకులు ఆలేటి శ్రీనివాసరెడ్డి గాలి రాజుయాదవ్ ఆలేటి సంపత్ రెడ్డి మద్దూరి లింగయ్య యాదవ్ గాలి చేరలు యాదవ్ గిరాం చందర్రావు మద్దూరి కొమురయ్య యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!