చందుర్తి, నేటిధాత్రి:
చందుర్తి మండలం మల్యాల గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్న విద్యార్థిని విద్యార్థులకు చందుర్తి మండల కోఆప్షన్ మెంబర్ బత్తుల కమలాకర్ ఆల్ ఇన్ వన్ పుస్తకం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కమలాకర్ మాట్లాడుతూ… మల్యాల గ్రామం అంటే ఒక ఆదర్శ గ్రామంగా పేరు తెచ్చుకుందని ఏ గ్రామంలో లేనివిధంగా ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేటు ఉద్యోగాల్లో స్థిరమైనటువంటి యువత ఉన్నారని వారిని ఆదర్శంగా తీసుకొని పదవ తరగతి చదువుతున్నటువంటి విద్యార్థిని విద్యార్థులు పరీక్షల మంచిగా చదువుకొని బాగా రాసి మంచి గ్రేడింగ్ పొందాలని భవిష్యత్తులో మంచి ఉన్నత శిఖరాలకు ఉద్యోగాలను పొందాలని వ్యసనాలకు బానిస కాకుండా మంచి విద్యావంతులుగా రాబోవు తరాలకు ఆదర్శంగా ఉండాలన్నారు. నేను తక్కువగా చదువుకున్న ఇప్పుడున్నటువంటి తరం ఉన్నత శిఖరాల్లో చదువుకొని మంచి భవిష్యత్తును తీర్చేదిద్దుకోవాలని చిన్న ప్రోత్సాహకాలుగా ఇవ్వడం జరుగుతుందన్నారు ఇట్టి కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ తిప్పని శ్రీనివాస్, మండల వైస్ ఎంపీపీ మందాల అబ్రహం, తాజా మాజీ వాడి సభ్యులు చంటి ప్రసాద్, మూడపల్లి శ్రీనివాస్, సుబ్రహ్మణ్యం పాఠశాల ప్రధానోపాధ్యాయులు శరత్ చంద్ర, ఉపాధ్యాయులు తిరుపతి రవికుమార్, రవి ఉపాధ్యాయునిలు ఝాన్సీ, రాధిక, అంజలి, స్వర్ణలత విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.