ఎల్ఆర్ఎస్ పై అవగాహన నిర్వహించిన డిఐజి
గంగాధర నేటిధాత్రి :
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఎల్ఆర్ఎస్ పథకం పట్ల గంగాధర సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో డీఐజీ రవీందర్ అవగాహన సదస్సు నిర్వహించారు. గురువారం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో స్టాంపుల విక్రేతలకు, దస్తావేజు లేఖరులకు ఎల్ఆర్ఎస్ ఉద్దేశ్యాన్ని ప్రభుత్వం కల్పిస్తున్న రాయితీలను వివరించారు. పలువురు అడిగిన సందేహాలను నివృత్తి చేసారు. ఈ నెలా 31 వరకు 25%శాతం రాయితీ తో అధిక సంఖ్యలో చెల్లించుకోవాలని కోరారు.