Hrithik’s Take on Durandhar
విమర్శించాడా…
బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ ఇటీవల విడుదలైన ‘దురంధర్’ సినిమాను ఆకాశానికి ఎత్తేశాడు. ఆ సినిమా తనకు తెగ నచ్చిందని తెలిపాడు. అదే సమయంలో అందులోని రాజకీయ అంశాలతో తాను ఏకీభవించనని, కొన్ని సందర్భాలలో ఫిల్మ్ మేకర్స్ ప్రపంచ పౌరులుగా ఆలోచించాలని సూచన చేశాడు. దీనిపై ఇప్పుడు పెద్ద చర్చ జరుగుతోంది.
ఉరి: ది సర్జికల్ స్ట్రైక్’ (Uri: The Surgical Strike) మూవీ తర్వాత ఆదిత్య థర్ తెరకెక్కించిన సినిమా ‘దురంధర్’ (Durandhar). డిసెంబర్ 5న విడుదలైన ఈ సినిమాపై మిక్స్డ్ రివ్యూస్ వచ్చిన… వాటికి భిన్నంగా సినిమా విజయపథంలో దూసుకుపోతోంది. సినిమా నిడివి మూడున్నర గంటలు ఉండటాన్ని చాలామంది విమర్శిస్తున్నా… మరికొందరు అంత సమయం సినిమా చూశామనే భావనే తమకు కలగలేదని చెబుతున్నారు. ఈ మధ్య కాలంలో ఇండి-పాక్ వార్ నేపథ్యంలో వచ్చిన చిత్రాలు పెద్దంతగా జనాదరణకు నోచుకోలేదు. వాటి మేకింగ్ ఎఫిక్టివ్ గా లేకపోవడమే దానికి కారణమని విమర్శకులు చెబుతున్నారు. ఈ సమయంలో ‘దురంధర్’ మూవీని ఆదిత్య ధర్ (Aditya Dhar) ఎలాంటి శష బిషలు పెట్టుకోకుండా తాను అనుకున్న రీతిలో, అనుకున్న విధంగా తీశారు. ఇండియాను నాశనం చేయడానికి శత్రుదేశం పాకిస్తాన్ ఎలాంటి పన్నాగులు పన్నుతుంటుంది, వాటిని సమర్థవంతంగా ఎదుర్కోవడానికి అదే దేశంలో భారత దేశానికి చెందిన సీక్రెట్ ఏజెంట్స్ ఎలా పనిచేస్తుంటారో ఇందులో చూపించారు. మరీ ముఖ్యంగా పాకిస్తాన్ లోని పాలిటిక్స్, మిలిటరీ వ్యవస్థలకు సంబంధించి కూలంకషంగా ‘దురంధర్’లో చూపించే ప్రయత్నం ఆదిత్య ధర్ చేశాడు. ఇది ఓ రకంగా ఇక్కడి వారిని బాగా ఆకట్టుకున్న అంశం. అదే సమయంలో పాకిస్తాన్ కుట్రలను భగ్నం చేయడానికి ఈ దేశ రహస్య గూఢచారులు ఎంతవరకైనా వెళతారనే విషయాన్ని చూపించిన విధానాన్ని అప్రిషియేట్ చేస్తున్నారు. సినిమాలో హింస మోతాదుకు మించి ఉందనే వాదనా లేకపోలేదు.ఈ నేపథ్యంలో బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ (Hrithik Roshan) ఈ సినిమా గురించి సోషల్ మీడియాలో పెట్టిన రివ్యూ చర్చలకు దారితీస్తోంది. ‘నాకు సినిమాలంటే ఇష్టం. కథలో ప్రేక్షకుడిని లీనం చేసి, వారి మనసులోని భావాలను బయటకు తీసుకొచ్చే ఫిల్మ్ మేకర్స్ అంటే అభిమానం. ‘దురంధర్’ కూడా అలాంటిఓ అద్భుతమైన సినిమా. నిజం చెప్పాలంటే… ఇదే అసలైన సినిమా’ అని ఆకాశానికి ఎత్తేశాడు. అదే సమయంలో ఈ సినిమాలోని రాజకీయాలతో తాను ఏకీభవించని, మేకర్స్ ఎప్పుడు విశ్వ మానవులమనే భావనతో సినిమాలు తీయాలని పేర్కొన్నాడు. అంటే ఈ సినిమాలో పాకిస్తాన్ ను శత్రువుగా ఆదిత్య ధర్ చూపించడాన్ని హృతిక్ రోషన్ కు ఎక్కడో బాధను కలిగించినట్టుగా నెటిజన్స్ భావిస్తున్నారు.
