రామడుగు, నేటిధాత్రి:
కరీంనగర్ జిల్లా రామడుగు మండలం గోపాలరావుపేట గ్రామ బస్టాండ్ వద్ద లయన్స్ క్లబ్ గోపాలరావుపేట ఆధ్వర్యంలో డయబేటిక్, రక్తపోటు(బిపి) పరీక్షలు నూట ముప్పై తోమ్మిది మందికి చేయగా ముప్పై ఎనిమిది మందికి షుగర్ ఉన్నట్లు నిర్ధారణ జరిగినది. వారిని ప్రభుత్వ హాస్పిటలకు పంపించడం జరిగింది. ఈకార్యక్రమంలో లయన్స్ క్లబ్ అధ్యక్షులు కర్ర ప్రభాకర్ రెడ్డి, మోర భద్రశం, మాజీ రీజియన్ చైర్మన్ గోలి మధుసూదన్ రెడ్డి, మాజీ జోన్ చైర్మన్స్ కర్ర శ్యామ్ సుందర్ రెడ్డి, కొడిమ్యాల వెంకటరమణ, మాజీ లయన్స్ క్లబ్ అధ్యక్షులు ముదుగంటి రాజిరెడ్డి, కోట్ల మల్లేశం, డైరెక్టర్స్ కర్ర రాజిరెడ్డి, పాకాల మోహన్, గ్రామ ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.