పాల్గొననున్న మాజీ మంత్రులు,ఎమ్మెల్యేలు
పార్టీశ్రేణులు అధికసంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపు
పరకాల నేటిధాత్రి
హనుమకొండ జిల్లా పరకాల నియోజకవర్గం ఆత్మకూరు మండలం అగ్రంపాడ్ గ్రామంలో జరుగుతున్న సమ్మక్క సారలమ్మ జాతరలో అమ్మవార్ల దర్శనం కోసం నేను కుటుంబ సమేతంగా వెళ్ళినప్పుడు కార్యకర్తలు జై తెలంగాణ నినాదాలు చేశారని తప్పుడు కేసులు బనాయించి ఆదివారం తెల్లవారుజామున ఆత్మకూరు మరియు దామెర మండలాలకు చెందిన బి.ఆర్.ఎస్.నాయకులను కిడ్నాప్ చేసిన విధంగా తీసుకొని వెళ్ళి విచక్షణారహితంగా థర్డ్ డిగ్రీ ఉపయోగించి చితకబాదిన కేసులో వరంగల్ పోలీస్ కమిషనర్ సమగ్ర దర్యాప్తు కోసం ఆదేశించడం జరిగింది.పూర్తి నివేదిక అందిన వెంటనే బి.ఆర్.ఎస్ నాయకులపై అక్రమ కేసులు బనాయించి,థర్డ్ డిగ్రీ ఉపయోగించి హింసించిన పోలీస్ అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని,రేపటి వరకు సమయం ఇవ్వాలని సిపి కోరడం జరిగిందని తెలిపారు.వరంగల్ సిపి పై ఉన్న నమ్మకంతో రేపటి వరకు వేచి చూస్తామని తెలిపారు.ఒకవేళ సంబంధిత పోలీస్ అధికారులపై ఎలాంటి చర్యలు తీసుకోని యెడల బి.ఆర్.ఎస్.రాష్ట్ర పార్టీ ఆధ్వర్యంలో ఈ నెల 28న ఆత్మకూరు మండల కేంద్రంలో ధర్నా కార్యక్రమం నిర్వహిస్తామని తెలిపారు.ఈ ధర్నా కార్యక్రమంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలోని మాజీ మంత్రులు,ఎమ్మెల్యేలు,ప్రస్తుత ఎమ్మెల్యేలు, ఎంపీలు,ఎమ్మెల్సీలు,జెడ్పీ చైర్మన్లు పాల్గొంటారని అదేవిధంగా నియోజకవర్గంలోని బి.ఆర్.ఎస్.పార్టీ శ్రేణులు, అభిమానులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.ఈ సమావేశంలో వరంగల్ రెడ్ క్రాస్ చైర్మన్ నిమ్మగడ్డ వెంకటేశ్వర రావు,సంగెం జడ్పీటిసి గూడ సుదర్శన్ రెడ్డి,దామెర వైస్ ఎంపిపి ఎండి జాకీర్ అలీ,నాయకులు గోల్కొండ శ్రీనివాస్,కన్నెబోయిన రమేష్ తదితరులు పాల్గొన్నారు.