
Dharmasamaj Party to Fight for BC SC ST Rights in Local Elections
స్థానిక సంస్థల ఎన్నికల్లో ధర్మసమాజ్ పార్టీ- ధర్మ యుద్ధం.
చిట్యాల, నేటిధాత్రి :
తెలంగాణ రాష్ట్రంలో భారత రాజ్యాంగ స్ఫూర్తిని, మహనీయుల ఆశయాలను కొనసాగిస్తూ దశాబ్ద కాలం పైగా బీసీ ఎస్సీ ఎస్టీ ప్రజలను సామాజికంగా మరియు రాజకీయంగా చైతన్య పరుస్తూ నిరంతరం ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్న ధర్మ సమాజ్ పార్టీ అధినాయకులు డాక్టర్ విశారదన్ మహారాజ్ నాయకత్వంలో స్థానిక సంస్థల ఎన్నికల సమరంలో ధర్మ సమాజ్ పార్టీ ధర్మ యుద్ధం చేయబోతుందని చిట్యాల మండల కేంద్రంలో భూపాలపల్లి జిల్లా కోశాధికారి శీలపాక నాగరాజ్ అన్నారు.
రాష్ట్రంలో అన్ని సామాజిక వర్గాలకు సమానమైన రాజకీయ అవకాశాలు ధర్మసమాజ్ పార్టీ కల్పిస్తుందన్నారు. అగ్రవర్ణ నాయకత్వంలో నడుస్తున్న పార్టీలు మెజారిటీ ప్రజలైన బీసీ ఎస్సీ ఎస్టీలకు అన్ని రంగాలలో అన్యాయం చేస్తున్నాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే విద్య ఉద్యోగ నామినేటెడ్ పదవులలో ముందుగా సమన్యాయం చేయాలన్నారు. తెలంగాణ బహుజన ప్రజలను మభ్యపెట్టి మోసం చేస్తున్న అగ్రవర్ణ పార్టీలకు అభిముఖంగా బీసీ ఎస్సీ ఎస్టీ ప్రజల స్వధర్మంతో, స్వశక్తి ఉద్యమంతో నిర్మాణమైన ధర్మసమాజ్ పార్టీ మెజారిటీ ప్రజల స్వరాజ్యకాంక్షను నెరవేర్చడానికి మాన్యశ్రీ కాన్షిరాం యుద్ధనీతితో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ధర్మ యుద్ధం చేయబోతుందని శీలపాక నాగరాజ్ అన్నారు.
ఈ కార్యక్రమంలో చిట్యాల మండల పార్టీ అధ్యక్షుడు పర్లపల్లి కుమార్, ఉపాధ్యక్షుడు పుల్ల అశోక్,ప్రధాన కార్యదర్శి నేరెళ్ల రమేష్, కార్యదర్శి మట్టేవాడ కుమార్ నవాబుపేట గ్రామ కమిటీ నాయకులు చిలుముల శశి కుమార్, చిలుముల కృష్ణ,పర్లపెల్లి వంశీ బొడ్డు పాల్ చరణ్ తదితరులు పాల్గొన్నారు