నియోజక వర్గలో విస్తృత ప్రచారం
డాక్టర్ తెల్లం వెంకట్రావు
పలు మండలాల్లో ప్రజాదరణ
నేటి ధాత్రి : భద్రాచలం :
తెలంగాణ అభివృద్ధి ప్రదాత ఉద్యమ వీరుడు, కల్వకుంట్ల చంద్రశేఖర రావు, తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పదములో నడిపించిన ఘనత ఆయనదే అని ఎం.ఎల్.సి తాత మధుసూదన్ రావు వివరించారు అదే బాటలో ప్రభుత్వ పథకాలను నియోజకవర్గ ప్రజల గుండెల్లో సానుభూతి పరుడైన డాక్టర్ తెల్లం వెంకట్రావు భద్రాచలం బి ఆర్ ఎస్ అభ్యర్థిగా పోటీ చేయడం ఆనందదాయకంగా ఉన్నది అని మాట్లాడారు, ప్రభుత్వ పథకాలు షాదీ ముబారక్, కల్యాణ లక్ష్మిదళిత బంధు, బీసీ బందు రైతుబంధు, వంటి పథకాలు ప్రవేశపెట్టిన ఘనత టిఆర్ఎస్ పార్టీ, ఉద్యమ నేత కెసిఆర్ దే అని మాట్లాడారు, మిషన్ భగీరథమిషన్ కాకతీయ, రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో నీళ్లు నియామకాలు, 24 గంటల విద్యుత్ సరఫరా రైతులకు అందించిన ఘనత మా పార్టీది అన్నారు, దశాబ్దాలు కాలం నుండి ఉమ్మడి రాష్ట్రంలో ఎన్ని ప్రభుత్వాలు మారిన తెలంగాణ రాష్ట్ర ప్రజల రాత మారలేదు అన్నారు, కెసిఆర్ పరిపాలన వచ్చిన తర్వాత ప్రపంచంలోనే, ఉన్నత స్థాయిలోచరిత్ర చెప్పుకునే విధంగా కెసిఆర్ అభివృద్ధి చేశారు అన్నారు, వచ్చే ఎన్నికల్లో, బి ఆర్ఎస్ పార్టీకి ప్రజలు పట్టం కట్టి అధికారంలోకి తీసుకొచ్చే విధంగా ప్రజల్లో మంచి ఆదరణ కలిగి ఉంది అని ధీమా వ్యక్తం చేశారు, ఈసారి భద్రాచలం నియోజకవర్గం అభ్యర్థిగా పోటీలో ఉన్న డాక్టర్ తెల్లం వెంకటరావును, గెలిపించాలని కోరారు, గతం కంటే ఎక్కువగా నియోజకవర్గ ప్రజల్లో ప్రథమ స్థానం డాక్టర్ వెంకట్రావుకి ఉన్నట్టు తెలిపారు, కార్యక్రమంలో, తాత మధుసూదనరావు, డాక్టర్ తెల్లం వెంకట్రావు, బొలిశెట్టి రంగారావు కొండిశెట్టికి కృష్ణమూర్తి, అరికెల తిరుపతిరావు, రమేష్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు…..