https://epaper.netidhatri.com/
ప్రజలు మెచ్చిన పాలన ప్రగతి పథంలో ముందున్న పాలన కెసిఆర్ సుపరిపాలన
పెట్టుబడుల స్వర్గదామం తెలంగాణ!
పదేళ్ల లో తెలంగాణ అభివృద్ధి పై పారిశ్రామిక ప్రగతి గురించిఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ నేటిధాత్రి ఎడిటర్ ‘‘కట్టా రాఘవేంద్రరావు’’ తో పంచుకున్న ఆసక్తికరమైన విషయాలు… ఆయన మాటల్లోనే…
` హైదరాబాద్ చుట్టూ అద్భుతమైన ప్రగతి.
`తెలంగాణలో పారిశ్రామిక విస్తరణ.
`ఐటిలో మేటి తెలంగాణ.
`తెలంగాణ వచ్చిన తర్వాత నాలుగు రెట్లు పెరిగిన ఐటి ఎగుమతులు.
`ఫార్మాహబ్ గా తెలంగాణ.
`హైదరాబాద్ లో మరిన్ని సొగసులు.
`కొత్త కట్టడాలు.
`మహానగరంగా…విశ్వ నగరంగా
`పేరుమోసిన వ్యాపార సముదాలన్నీ హైదరాబాద్ లోనే.
`బిజినెస్ సమ్మిట్ల వేధిక.
`ప్రపంచ స్థాయి కంపెనీల మూల సంస్థలు హైదరాబాద్ లో..
`రజనీకాంత్ లాంటి వారు ఆశ్చర్యపోయామన్నారు.
`లండన్ లో వున్నానా అని చెప్పిన సినీ నటి లయ.
హైదరాబాద్,నేటిధాత్రి:
ఒక్కసారి కళ్లు మూసుకొని గతంలోకి తొంగిచూసి, కళ్లు తెరిస్తే చాలు మన తెలంగాణ ఒక అందమైన ప్రపంచాన్ని తలపిస్తుంది. నాటి రోజులు, నేటి రోజులు బేరీజు వేసుకుంటే అందమైన ప్రపంచమే మన కళ్లముందు ఆవిషృతమౌతుంది. అంతలా తెలంగాణ మారిపోయింది. ముఖ్యంగా హైదరాబాద్ రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. పదేళ్ల క్రితం తెలంగాణ చూసిన వాళ్లు మళ్లీ హైదరాబాద్ వస్తే ఆశ్చర్యపోక తప్పదు. అసలు ట్యాంక్ బండ్‌ను కొన్ని దశాబ్దాల పాటు చూసిన వాళ్లు, మళ్లీ ఇప్పుడు చూస్తే ఆశ్చర్యం వక్తం చేస్తారు. అటు కొత్త సెక్రెటరియేట్, ఇటు అంబెద్కర్ విగ్రహం, ఆ పక్కన అమర వీరుల స్మృతి వనం, ముందు హుస్సేన్ సాగర్ , మధ్యలో గౌతమ బుద్దుడు. చెప్పుకుంటుంటూనే ఒక అందమైన లోకంలో విహరించినట్లు అనిపిస్తుంంది. చూసేవారికి సుందర లోకం కనిపిస్తుంది. ఇద మన తెలంగాణ అని గర్వంగా చెప్పుకునేంతగా ఎదగింది. దీనంతకీ కారణం ముఖ్యమంత్రి కేసిఆర్. ఆయన పాలనలో తెలంగాణే పెట్టుబడులకు స్వర్గదామంగా మారిపోయింది. పదేళ్ల క్రితం తెలంగాణ గురించి మాట్లాడుకోవాల్సి వస్తే ఏముందో వింటే మనసు కలిచివేస్తుంది. కన్నీళ్ల దుఖం తన్నుకొస్తుంది. ఆ గోసులు కళ్లముందు కదలాడుతుంటాయి. ఉపాధిలేక, వ్యవసాయం సాగక, చేతినిండా పని లేక, పస్తులతో కాలం వెల్లదీసింది తెలంగాణ. తెలంగాణ పల్లెల నిండా సమస్యలే..ఆకలి బాధలే…అరణ్య రోధనలే…ఇంటి ముందు కనీసం పాడి కూడా లేకుండా, పశువులను కూడా సాదుకోలేని దుస్ధితి తెలంగానది. అలాంటి తెలంగాణను విముక్తి చేయాలని, తెలంగాణ వస్తే తప్ప బతుకులు బాడపడవని, ఉమ్మడి రాష్ట్రంలో ఇక ఊపిరి కూడా తీసుకోలేమని ముఖ్యమంత్రి కేసిఆర్ పద్నాలుగేళ్ల సుధీర్ఘ పోరాటం చేశారు. నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలను ఏకం చేశాడు. ఉద్యమ బాట పట్టించాడు. తెలంగాణ వెతలు తీరాలంటే తెలంగాణ రావాల్సిందే అని ప్రజల్లో చైతన్యం నింపాడు. దేశానికి అవసరమైతే ఇంటికో సైనికుడు ఎలా తయారు కావాలో..తెలంగాణ కోసం కూడా ఇంటికొకరు కదలాలని చెబితే మొత్తం తెలంగాణ సమాజామే కదిలింది. కేసిఆర్ వెంట నడిచింది. తెలంగాణ సాధన కోసం అహర్నిషలు కొట్లాడి కేసిఆర్ తెలంగాణ సాధించారు. తెచ్చిన తెలంగాణను బంగారు తెలంగాణ చేశారు. తెలంగాణ జీవితాల్లో వెలుగులు నింపారు. తెలంగాణ యువత కోసం మరో లోకం నిర్మించారు. హైదరాబాద్‌లో అధ్భుతమైన అవకాశాల కల్పన వేదికను చేశారు. తెలంగాణనే పెట్టుబడుడుల స్వర్గదామం చేశారు. అందుకోసం మంత్రి కేటిఆర్ చేసిన కృషి అంతా ఇంతా కాదు. తెలంగాణ ఈ పదేళ్ల కాలంలో అన్ని రంగాల పురోగతి సాధించడం అన్నది సామాన్య విషయంకాదు. అందరి వల్ల అయ్యేది కాదు. ఇలా ఏక కాలంలో సమ్మిలిత వృద్ధి సాధించడం అన్నది చాలా గొప్ప విషయం. ఒకప్పుడు అమెరికా లాంటి దేశాలు తిరిగి వచ్చిన వారు ఆ దేశాల గొప్పదనం చెబుతుండేవారు. ఇప్పుడు అమెరికాలాంటి దేశాల నుంచి వచ్చిన వారు హైదరాబాద్‌ను చూసి ఆశ్చర్యపోతున్నారు. అంతే కాదు అమెరికాలో కొన్ని వందల ఎకరాలు స్ధలాలుండి, ఆస్ధులు సంపాదించిన వాళ్లు కూడా ఇప్పుడు హైదరాబాద్‌లో ఎకరం స్ధలం కొనాలంటే మా స్దోమత సరిపోదని చెబుతున్నారు. అంటే తెలంగాణలో భూముల విలువ ఎంత పెరిగిందో, తెలంగాణ సగటు వ్యక్తి ఎంత ఎదిగాడో అర్ధం చేసుకోవచ్చు. తాజాగా కోకాపేటలో ఎకరం వంద కోట్లు పలికిందంటే హైదరాబాద్‌లో ఎంత అభివృద్ధి చెందిందో అర్ధం చేసుకోవచ్చు. ఆ మధ్య తమిళ సూపర్ స్టార్ రజనీ కాంత్ హైదరాబాద్‌లో తిరుగి, నేను అమెరికాలో వున్నానా..లండన్‌లో వున్నానా? అన్న అనుమానం కలిగిందని కితాబిచ్చారు. సీని నటి లయ లండన్ నుంచి వచ్చినా లండన్‌లో వున్నట్లే అనిపిస్తందని చెప్పింది. అంటే హైదరాబాద్ ఎంతలా అభివృద్ధి చెందిందో అర్ధం చేసుకోవచ్చు. అనితర సాధ్యమైన పనిని, సాధించి తెలంగాణ ప్రజలకు బహుమానంగా అందించడం అంటే మాటలు కాదు. అలాంటి అభివృద్ధి యజ్ఞంలో ముఖ్యమంత్రి కేసిఆర్ ఆలోచనలకు, ఆచర రూపం కల్పించి తెలంగాణను పారిశ్రామిక రంగంలో నెంబర్ వన్ చేశారు. తెలంగాణలో మంత్రి కేటిఆర్ పారిశ్రామిక విప్లవం సృష్టించారు. అంటున్న ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, నేటిధాత్రి ఎడిటర్ కట్టారాఘవేంద్రరావుతో పంచుకున్న ఆసక్తికరమైన విషయాలు ఆయన మాటల్లోనే…
తెలంగాణ రాకు ముందు ఐటి ఎగుమతులు రూ.50వేల కోట్లు. కాని నేడు అంతకు నాలుగురెట్లు పెరిగింది.
ప్రస్తుతం రెండున్నర లక్షల కోట్ల ఐటి ఎగుమతులు జరుగుతున్నాయి. ఒకప్పుడు ఐటి అంటే బెంగుళూరు గురించి చెప్పుకునేవారు. ఆ తర్వాత చెన్నై అనేవారు. కాని నేడు ఎక్కడ విన్నా హైదరాబాద్ గురించె మాట్లాడుకుంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న పారిశ్రామిక విధానం మూలంగా పెట్టుబడులు వెల్లువలా వచ్చాయి. తెలంగాణ వస్తే చిమ్మ చీకట్ల మయమౌతుందని భయపెట్టారు. తెలంగాణరాష్ట్రం సాధించుకున్నా ముఖ్యమంత్రికేసిఆర్ విజన్ చూసి ఆశ్చర్యపోతున్నారు. తెలంగాణ వెలుగులు చూసి నిజమా..కలా అనుకుంటున్నారు. ఒకప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు పెద్దగా ముందుకు వచ్చేవారు. అప్పటి ప్రభుత్వాలు ఎంత ఆహ్వానించినా వచ్చేవారు కాదు. కారణం కరంటు. ఒక దశలో పరిశ్రమలు కూడా పవర్ హాలిడే ప్రకటించుకోవాల్సిన పరిస్ధితి ఏర్పడిరది. అంతే కాదు చంద్రబాబు ముఖ్యమంత్రి వున్న సమయంలో క్రాప్ హాలిడే కూడా ప్రకటించడం చూశాం. అసలు తెలంగాణలో సాగే లేదంటే క్రాప్ హలిడే ప్రకటించి తెలంగాణను అంధకారం చేశారు. అలాంటి కాలం నుంచి తెలంగాణ నేడు వెలుగు కాలం చూస్తోంది. రెప్పపాటు కూడా పోని కరంటును చూస్తోంది. దేశంలో ఎక్కడా ఇంతగా విద్యుత్ సౌకర్యం లేదు. బెంగుళూరు వంటి నగరాల్లో కూడా ప్రస్తుతం కరంటు కోతలు వున్న సంగతి తెలిసిందే. కాని తెలంగాణలో ఒక్క గృహ అవసరాలకే కాదు, రైతాంగానికి ఉచితంగా 24 గంటల కరంటు ఇవ్వడం జరుగుతోంది. పరిశ్రమలకు పవర్ హాలీడే అన్నది ఎప్పుడూ లేదు. తెలంగాణలో ఐటి పరిశ్రమతోపాటు ఫార్మా రంగం కూడా విస్తరించింది. ప్రభుత్వం తీసుకున్న చొరవతో పెద్దఎత్తున ఫార్మాకంపనీలు తెలంగాణలో తమ ఉత్పత్తులను ప్రారంభించాయి. ఈ సందర్భంగా హెటిరో సంస్ధ పార్ధసారధిరెడ్డి చెప్పిన విషయం గుర్తు చేయాలి. గతంలో తమ ప్లాంటుకు నిత్యం కొన్ని వందల వాటర్ ట్యాంకులు కొని తెచ్చుకునే వాళ్లం. విదేశాల ప్రతినిధులు ఓ ఫార్మా తయారీ కోసం తమ సంస్ధను ఎంచుకొని అగ్రిమెంట్లు జరిగే సమయంలో వాటర్ ట్యాంకులను చూసి ఆ ఒప్పందం ఆగిపోయింది. ఓసారి ముఖ్యమంత్రి కేసిఆర్ తమ సంస్ధను సందర్శించినప్పుడు అదే సీన్ చూశారు. మాకు నీటి కొరత వుందని ఒక్క మాట చెప్పగానే వారం రోజుల్లో నీటి సౌకర్యం కల్పించారని చెప్పారు. అంటే తెలంగాణ పారిశ్రామిక రంగం వృద్ధి మీద ముఖ్యమంత్రి కేసిఆర్‌కు ఎంత చిత్త శుద్ది వుందో ఈ ఒక్క సంఘటనతోనే తెలుసుకోవచ్చు. తెలంగాణలో వైద్య విప్లవం కొనసాగుతోంది. తెలంగాణలో గ్లోబల్ సెంటర్ల ఏర్పాటు పెరుగుతోంది. గతంలో బెంగుళూరును ఎంచుకునేవారు. కాని ఇప్పుడు ప్రపంచ దేశాలు సైతం హైదరాబాద్ వైపు చూస్తున్నాయి. హైదరాబాద్‌లో తమ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నారు. 2020లో 5 సెంటర్లతో మొదలై గ్లోబల్ సెంటర్ల ఏర్పాటు ఈ ఏడాది ఏకంగా 33 సెంటర్లు ఏర్పాటు చేశారంటే హైదరాబాద్ బ్రాండ్ గొప్పదనం తెలుస్తోంది. ఇలా తెలంగాణ అన్ని రంగాలలో ముందుకు దూసుకెళ్తోంది. ఏ రంగం చూసినా తెలంగాణే కనిపిస్తోంది. సంక్షేమ రంగంలో తెలంగాణను మించిన రాష్ట్రం మరొకటి లేదు. అభివృద్ధి విషయంలో తెలంగాణతో పోటీ పడే రాష్ట్రం లేదు. పారిశ్రామిక ప్రగతి పరుగులో తెలంగాణే ముందుంది. చివరికి తొండలు కూడా గుడ్లు పెట్టవని ఎగతాళి చేసిన నేలల్లోనే బంగారు పంటలు పండుతున్నాయి. వ్యవసాయం రంగంలోనూ నెంబర్ వన్‌గా వెలుగొందుతోంది. అదీ కేసిఆర్ పాలనకు నిదర్శనం. తెలంగాణ ప్రగతికి సంకేతం. పారిశ్రామికాభివృ ద్ధికి నిదర్శనం.