
– విద్యాశాఖ అధికారులపై చర్యలు తీసుకోవాలి
– ఏబీవీపీ రాష్ట్ర హాస్టల్స్ కన్వీనర్ మారవేణి రంజిత్ కుమార్
సిరిసిల్ల(నేటి ధాత్రి):
కార్పొరేట్ విద్యాసంస్థల యాజమాన్యాలకు విద్యాశాఖా ధికారులు తొత్తులుగా మారి అనుమతులు లేని పాఠశాలలు జిల్లాలో నడిపిస్తున్నారని ఏబీవీపీ రాష్ట్ర హాస్టల్స్ కన్వీనర్ మారవేణి రంజిత్ కుమార్ అన్నారు. సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్ లోని డీ,ఈ,ఓ కార్యాలయం ముందు ఏబీవీపీ నాయకులు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మారవేని రంజిత్ కుమార్ మాట్లాడుతూ ప్రైవేట్ పాఠశాలల్లో అధిక పీజీలు, బుక్స్ ను అధికరేట్లకు అమ్మిన అధికారులు పట్టించుకోవడంలేదని, అనేకసార్లు డి ఈ ఓ కు వినతి పత్రాలు అందించిన స్పందించడం లేదన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు లేవని చెట్ల కింద విద్యార్థులు చదువుతున్నారని తెలిపారు. ప్రైవేటు పాఠశాల నుండి డబ్బులు తీసుకుంటున్నారని స్వయంగా ఎంఈఓ నే చెప్పాడని అన్నారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులను తగ్గించడానికి విద్యాశాఖ అధికారులు ప్రైవేట్ పాఠశాలలతో కుమ్మక్కయ్యారని ఆరోపించారు. ఇప్పటికైనా డీఈవో అనుమతులు లేని పాఠశాలలపై దృష్టి సారించాలని ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించి పేద విద్యార్థులను ఆదుకోవాలని కోరారు. కార్యక్రమంలో సావనపెల్లి ప్రశాంత్, లో పెల్లి రాజు, తిరుపతి, పెండ్యాల శివ, శ్రీనివాస్ ,తదితరులు పాల్గొన్నారు