లైన్స్ క్లబ్ మూడోసారి చైర్మన్గా దేమె యాదగిరి…
రామాయంపేట ఏప్రిల్ 1 నేటి ధాత్రి (మెదక్)
లయన్స్ క్లబ్ ఆఫ్ రామాయంపేట 2025-2026 సంవత్సరానికి గాను అధ్యక్షుడిగా మూడవసారి దేమే యాదగిరి, సెక్రటరీగా తిరుపతి, ట్రెజరర్ గా జిపి స్వామి లను పివిపి చారి మాజీ గవర్నర్ సమక్షంలో స్థానిక మెహర్ సాయి ఫంక్షన్ హాల్లో జరిగిన కార్యక్రమంలో ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ లైన్స్ క్లబ్ సేవలను విస్తృత పరిచి గ్రామాలలో చక్కటి కార్యక్రమాలు చేపడతామని మొక్కల పంపకం,నీటి సంరక్షణ, అవయవదానం,ఉచిత కంటి మరియు దంత వైద్య ఆరోగ్య శిబిరాలు విరివిగా నిర్వహిస్తామని స్కూల్ లలో విద్యార్థులకు వ్యాస రచన,కెపాసిటీ బిల్డింగ్ గురించి సమావేశాలు ఏర్పాటు చేస్తామని వారు తెలిపారు. తమను ఎన్నుకున్నందుకు రీజియనల్ చైర్మన సంజయ్ గుప్తా, జోన్ చైర్ పర్సన్ సుఖేందర్, ఏరియా కోఆర్డినేటర్ రాజశేఖర్ రెడ్డి,డిసీలు లక్ష్మణ్ యాదవ్, కైలాసం, దారం రమేష్ లకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో క్లబ్ సభ్యులు పాల్గొన్నారు.