నాయకపోడ్ కుల గణన చేపట్టాలని డిమాండ్

నాయకపోడ్ కుల గణన చేపట్టాలని డిమాండ్

జిల్లా కలెక్టర్ కుమార్ దీపకి మెమోరండం అందజేత

మంచిర్యాల,నేటి ధాత్రి:

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నాయకపోడ్ కులస్థుల జనాభా సుమారు 7 లక్షల వరకు ఉందని పేర్కొంటూ,రాష్ట్ర ప్రభుత్వం త్వరితగతిన కుల గణన (సర్వే) నిర్వహించాలని నాయకపోడ్ కుల సంఘం నాయకులు డిమాండ్ చేశారు.కుల గణన చేపడితే తమ తెగకు సంబంధించిన సామాజిక, ఆర్థిక పరిస్థితులు స్పష్టంగా బయటపడతాయని,దాని ఆధారంగా అభివృద్ధి కార్యక్రమాలు మరింత సమర్థంగా అమలు చేయవచ్చని తెలిపారు.అందువల్ల రాష్ట్రవ్యాప్తంగా నాయకపోడ్ కుల గణన నిర్వహించాలని కోరారు.ఈ నేపథ్యంలో,మంచిర్యాల జిల్లా కలెక్టర్‌ను కలిసి సోమవారం మెమోరాండం సమర్పించారు.ఈ కార్యక్రమంలో నాయకపోడ్ కుల సంఘం నాయకులు పాల్గొన్నారు.
మొత్తంగా,కుల గణన ద్వారా తమ వర్గానికి న్యాయం జరగాలని,అభివృద్ధి అవకాశాలు పెరగాలని నాయకులు ఆకాంక్ష వ్యక్తం చేశారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version