
Delhi High Court Protects Nagarjuna’s Rights
హీరో అక్కినేని నాగార్జునకు ఢిల్లీ హైకోర్టు అండ
సినీ నటుడు నాగార్జున వ్యక్తిగత హక్కులకు రక్షణ కల్పిస్తూ ఢిల్లీ హైకోర్టు ఇవాళ ఆదేశాలిచ్చింది. నాగార్జున నుంచి ముందస్తు అనుమతి లేకుండా వాణిజ్య ప్రకటనలకు ఆయన పేరు, స్వరం ఉపయోగించకూడదని..
సినీ నటుడు అక్కినేని నాగార్జున పిటీషన్‌పై ఢిల్లీ హైకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. నాగార్జున వ్యక్తిగత హక్కులకు రక్షణ కల్పిస్తూ ఢిల్లీ హైకోర్టు ఇవాళ ఆదేశాలిచ్చింది. ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన ఢిల్లీ హైకోర్టు.. నాగార్జున నుంచి ముందస్తు అనుమతి లేకుండా వాణిజ్య ప్రకటనలకు ఆయన పేరు, స్వరం ఉపయోగించకూడదని ఉత్తర్వులు జారీ చేసింది. ఏఐ, జెఏఐ, మెషిన్ లెర్నింగ్, డీప్ ఫేక్స్ లాంటి చర్యలకు పాల్పడితే చట్టపరమైన చర్యలుంటాయని ఢిల్లీ హైకోర్టు హెచ్చరించింది.