ప్రతిభావంతులకు పట్టాలు: కిట్స్ ఇంజనీరింగ్ కళాశాల గ్రాడ్యుయేషన్ డే వేడుకలు.
కోదాడ, నేటి ధాత్రి:
స్థానిక కిట్స్ ఇంజనీరింగ్ కళాశాలలో విద్యార్థుల నాలుగేళ్ల శ్రమకు సాధనకు గుర్తింపు లభించింది ఎంతో ఉత్వహభరితమైన వాతావరణంలో కళాశాల స్నాతకోత్సవ వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా కళాశాల చైర్మన్ డాక్టర్ నీలా సత్యనారాయణ పాల్గొని పట్టభద్రులను ఉద్దేశించి మాట్లాడుతూ.
మానవ విలువలతో కూడిన విద్యను అత్యాధునిక సాంకేతికతను ఎప్పటికప్పుడు అందిపుచ్చుకోవాలని భవిష్యత్తును రూపొందించే ఆవిష్కరణలను చేపట్టాలని పట్టభద్రులకు సూచించారు, అలాగే గ్రామీణ స్థాయి నుంచి ఇంజనీరింగ్ లో పట్టబద్రులు కావడం ఎంతో గర్వకారణమని ఇదే స్ఫూర్తితో ఉన్నత ఉద్యోగాలు సాధించి తల్లిదండ్రుల కలలు సాకారం చేయాలని పట్టభద్రులకు సూచించారు.అదేవిధంగా గ్రామీణ ప్రాంతంలో ఉన్నత ప్రమాణాలతో సాంకేతిక విద్యను విద్యార్థినులకు అందించాలని ఉద్దేశంతో కళాశాలను స్థాపించినట్లు వివరించడం జరిగింది.పట్టభద్రులకు స్నాతకోత్సవ పట్టాలను కళాశాల చైర్మన్ చేతుల మీదుగా అందించారు.
విద్యార్థినిలు ప్రదర్శించిన సంస్కృతిగా కార్యక్రమాలు అందర్నీ అలరించి ఆనందింపజేశాయి.ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పెరుమాళ్ళపల్లి గాంధీ,
అకాడమిక్ డైరెక్టర్ డాక్టర్ నాగార్జున రావు,వివిధ విభాగాధిపతులు రమేష్, నరేష్ రెడ్డి, స్రవంతి, శివాజీ, లక్ష్మణ్, అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థినులు, తల్లితండ్రులు పాల్గొన్నారు.
