వ్యర్ధాల నుండి విజ్ఞానం – అంగన్వాడి చిన్నారుల సృజనాత్మక ప్రదర్శన..

వ్యర్ధాల నుండి విజ్ఞానం – అంగన్వాడి చిన్నారుల సృజనాత్మక ప్రదర్శన.

అంగన్వాడి చిట్టి చేతుల – అద్భుత కళా సృష్టి

వేస్ట్ మెటీరియల్ తో క్రియేటివిటీస్ చేయడం అభినందనీయం

అంగన్వాడీ టీచర్స్ ఏర్పాటు చేసిన స్టాల్స్ పలువురిని ఆకట్టుకున్నాయి.

జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్

కోదాడ, నేటి ధాత్రి :

ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా కోదాడ నియోజకవర్గ స్థాయి సమావేశం కోదాడలో ఆర్ఎస్వి ఫంక్షన్ హాల్ లో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో తమ్మర బండపాలెం మొదటి అంగన్వాడి సెంటర్ టీచర్ వెంకటరమణ వేస్ట్ మెటీరియల్ తో తయారు చేసిన బొమ్మలను కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ పర్యవేక్షించి టీచర్ ను ఎలా తయారు చేశారు అని వివరాలు అడిగి తెలుసుకుని అభినందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పిల్లలకి చిన్ననాటి నుండే వేస్ట్ మెటీరియల్ మెటీరియల్ నుంచి ఏవైతే తయారు చేయగలుగుతారు అవి పిల్లలకు నేర్పించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో (సిడిపిఓ) శిశు అభివృద్ధి ప్రాజెక్ట్ అధికారి పారిజాతం, శిశు సమృద్ధి శాఖ మండల అధికారులు, నియోజకవర్గ అంగన్వాడీ టీచర్లు, అంగన్వాడీ సిబ్బంది తదితరులు అధికారులు పాల్గొన్నారు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version