Defeat Is the First Step to Victory: Challa Dharma Reddy
ఓటమి గెలుపుకు తొలిమెట్టు-మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి
పరకాల,నేటిధాత్రి
ఓటమి గెలుపుకు తొలిమెట్టని మాజీ శాసనసభ్యులు చల్లధర్మ రెడ్డి అన్నారు.ఈ సందర్బంగా మాట్లాడుతూ పంచాయతీ ఎన్నికల్లో పోటీపడి ఓటమి చెందిన బిఆర్ఎస్ అభ్యర్థులు మనోధైర్యంతో ముందుకు సాగాలని అన్నారు.శనివారం పరకాల మండలం పోచారం,వెల్లంపల్లి,పైడిపల్లి,కామారెడ్డిపల్లి గ్రామాలలో వారు పర్యటించారు.ఈ సందర్భంగా ఓటమించేందిన పార్టీ అభ్యర్థులను కలిసి ఓదార్చారు.ఈ కార్యక్రమంలో మండల బిఆర్ఎస్ నాయకులు,కార్యకర్తలు,యూత్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
