నడికూడ,నేటి ధాత్రి:
మండలంలోని రాయపర్తి గ్రామానికి చెందిన చెలుమల్ల సాంబ రెడ్డి (59) సోమవారం మార్త స్వామి వ్యవసాయ బావి వద్ద ఆత్మహత్య చేసుకోవడం జరిగింది.మృతుని భార్య సులోచన తెలిపిన వివరాల ప్రకారం సాంబరెడ్డి గత కొన్ని రోజుల నుండి మద్యానికి బానిసై ఆయన ఆరోగ్యం పై శ్రద్ధ పెట్టకపోవడంతో ఆదివారం కుటుంబ సభ్యులు మందలించడంతో సోమవారం ఉదయం ఇంట్లో నుండి ఎటో వెళ్లిపోయి మధ్యాహ్నం మార్త స్వామి వ్యవసాయ భూమి వద్ద చెట్టుకు తన లుంగితో ఆత్మహత్య చేసుకున్నాడని సమాచారం తనకు తెలిసిందని వెంటనే పోలీసులకు సమాచారం అందించి తన భర్త మృతి పై ఎటువంటి అనుమానం లేదని తెలిపినట్లు పరకాల పోలీసులు తెలిపారు.