అవినీతిలో దిట్ట డీలర్ శ్రీను

కోట్లకు పడగలెత్తిన అలియాస్ తాటిపల్లి శ్రీనివాస్

జైపూర్, నేటి ధాత్రి:

జైపూర్ మండల్ లో డీలర్ శ్రీను అక్రమాలు
సింగరేణి మైనింగ్ తహసిల్దార్ కార్యాలయ ఆఫీసర్లను కొని అక్రమ దందాలు
సహజ వనరులను దోచుకొని వందల కోట్లు సంపాదించిన డీలర్ శ్రీను
జైపూర్ మండలంలోని రామారావు పేట ఇందారం గ్రామ శివారులో ఐ కే. ఓ సి ఉపరితల గనుల కోసం రైతుల నుండి సింగరేణి సంస్థ తీసుకున్న భూములలో జైపూర్ మండలానికి చెందిన డీలర్ శ్రీను అలియాస్ తాటిపల్లి శ్రీనివాస్ అనే వ్యక్తి నిబంధనలకు విరుద్ధంగా ఓసి గుట్టల మధ్య సుమారుగా 10ఎకరాలలో రైస్ మిల్లు ఏర్పాటు చేస్తున్నాడు .ఈ రైస్ మిల్లులో మట్టి పోయడానికి రైస్ మిల్ అభివృద్ధి కొరకు పక్కనే ఉన్న ఓపెన్ కాస్ట్ గని కోసం సింగరేణి యాజమాన్యం రైతుల నుండి డబ్బులు ఇచ్చి సేకరించిన భూమిలో గత వారం నుండి 10 లారీలతో రెండు జెసిబి లతో సుమారుగా రెండువేల లారీ ట్రిప్పుల మట్టిని తరలించి పనులు జరుపుతున్నారు. ఈ విషయంలో మంచిర్యాల జిల్లాలోని జిల్లా స్థాయి అధికారులైన మైనింగ్ శాఖ జిల్లా అధికారులను జైపూర్ మండలంలోని తహసిల్దార్ కార్యాలయ సిబ్బందిని సింగరేణి పిఓ శ్రీనివాసరావు వంటి అధికారులతో రహస్య ఒప్పందాలు జరుపుకొని అక్రమ దందాలు నిర్వహిస్తున్నారు. గతంలో ఈ వ్యక్తి టిఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్ అనుచరుడిగా అనేక వేలకోట్ల రూపాయలు సింగరేణి సంస్థ నుండి ఓపెన్ కాస్ట్ భూముల కేటాయింపులో లబ్ధి పొందినట్టు అనేక ఆరోపణలు ఉన్నాయి. ప్రస్తుత ఎమ్మెల్యే డాక్టర్ వివేక్ వెంకటస్వామి పేరు అధికారులకు చెప్పి అక్రమ దందా నిర్వహిస్తున్నాడు అన్న విషయం తెలుసుకున్న జైపూర్ మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహమ్మద్ ఫయాజుద్దీన్ మాజీ ఎంపిటిసి సుంకరి శ్రీనివాస్ నాయకులు షరీఫ్ రాకేష్ తదితరులు అక్రమ మైనింగ్ నిర్వహిస్తున్న భూములను పరిశీలించి అక్రమంగా నిర్మిస్తున్న రైస్ మిల్ ప్రాంతాన్ని సందర్శించి ప్రభుత్వం పేరు చెప్పి అక్రమ దందాలు చేయడాన్ని ఖండించారు. వివేక్ వెంకటస్వామి పాలన కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క పాలన చాలా పారదర్శకంగా ఉంటుందని డీలర్ శ్రీను నిర్వహిస్తున్న అనేక అక్రమాలకు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదని అన్నారు.ప్రభుత్వం పేరు చెప్పి వివేక్ వెంకటస్వామికి చెడ్డ పేరు తీసుకువస్తే వదిలిపెట్టమని గతంలో ఈ వ్యక్తి చేసిన అనేక మోసాలను అధికారుల దృష్టికి తీసుకెళ్తామని అన్నారు .జిల్లాలోని మండలంలోని వివిధ ప్రభుత్వ ఉద్యోగులు పారదర్శకంగా పనులు చేయాలని అక్రమార్కులకు సహకరించవద్దని ప్రభుత్వ అధికారులను కోరారు .సింగరేణి సంస్థ రైతుల నుండి భూములు సేకరించిన వెంటనే తమ భూముల చుట్టూ కందకం ఏర్పాటు చేయవలసి ఉన్న నిబంధనలను మరిచి కేవలం డీలర్ శ్రీనివాస్ రైస్ మిల్లు కొరకు మాత్రమే 30 ఫీట్ల మట్టి రోడ్డు నిర్మించి కందకం ఏర్పాటు చేయకపోవడం ఎంతవరకు సమంజసమని తన ఆవేదన వ్యక్తం చేశారు .పేద ప్రజల రక్తం తాగే అవినీతిపరులను క్షమించేది లేదని అన్నారు. ఈ కార్యక్రమంలో మైనింగ్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ తహసీల్దార్ కార్యాలయ సిబ్బంది ఆర్ ఐ తిరుపతి మరియు సింగరేణి విజిలెన్స్ అధికారులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *