గత ప్రభుత్వం దళిత జర్నలిస్టులను విస్మరించింది
ప్రెస్ అకాడమీ చైర్మన్ దళిత జర్నలిస్టులకు ఇవ్వాలి
డిప్యూటీ సిఎం భట్టికి వినతి పత్రం అందజేసిన దళిత జర్నలిస్టులు
మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి
దళిత జర్నలిస్టుకు సముచిత స్థానం కల్పించాలని, గత ప్రభుత్వం దళిత జర్నలిస్టులను విస్మరించిందని, ప్రెస్ అకాడమీ చైర్మన్ దళిత జర్నలిస్టులకు ఇవ్వాలని, దళిత జర్నలిస్ట్ ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు కాశపోగు అన్నారు. గురువారం హైదరాబాద్ లోని ప్రజాభవన్ (ప్రగతి భవన్) లో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కును మర్యాదపూర్వకంగా కలిసి, శాలువతో ఘనంగా సన్మానించిన అనంతరం, దళిత జర్నలిస్టుల ఫోరం డిమాండ్ తో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు. సానుకూలంగా స్పందించిన మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ… గత ప్రభుత్వంలో కేసీఆర్ జర్నలిస్టులను విస్మరించారని, మన ప్రజా ప్రభుత్వంలో జర్నలిస్టులకు సముచిత స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చారు.
ఫిబ్రవరి లో దళిత జర్నలిస్టుల ఫోరం తరఫున, దళిత మంత్రులు, ఎమ్మెల్యేలు, ఆయా శాఖల చైర్మన్లు, ముఖ్య ప్రజాప్రతినిధులకు హైదరాబాద్ లోని రవీంద్ర భారతి లో ఆత్మీయ సన్మానం ఉంటుందని అధ్యక్షుడు కాశపోగు జాన్ తెలిపారు. ఈ సమావేశానికి రాష్టంలో ఉన్న దళిత జర్నలిస్టులు పెద్ద ఎత్తున తరలి రావాలని పిలుపునిచ్చారు. అనంతరం సన్మాన కార్యక్రమ కరపత్రాన్ని కూడా ఆవిష్కరణ చేశారు.
ఈ కార్యక్రమంలో ఫోరం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డేవిడ్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు బండారు రాజు, జగత్ ప్రకాష్, రత్న కుమార్, రాష్ట్ర నాయకులు పెద్ది స్వామి, వనపర్తి జిల్లా అధ్యక్షుడు ధనుష్, సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు టి యాదగిరి, హైదరాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి మీసాల ఎల్లేష్, ఉపాధ్యక్షుడు దొమ్మాటి శివకుమార్, మహబూబ్ నగర్ జిల్లా అధ్యక్షుడు కృష్ణ ఇతర నాయకులు పాల్గొన్నారు.