D. Panthula Elected STPP Branch President
ఎస్టిపిపి బ్రాంచ్ ప్రెసిడెంట్ గా ఎన్నికైన డి.పంతులా
జైపూర్,నేటి ధాత్రి:
మంచిర్యాల జిల్లా జైపూర్ మండల కేంద్రంలోని సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్లో శుక్రవారం సిఎంఓఎఐ జనరల్ బాడి మీటింగ్,జనరల్ మేనేజర్ అధ్యక్షతన జరిపించారు.ఈ సమావేశంలో లో జనరల్ సెక్రటరీ సంతోష్ ఇదివరకు జరిగిన కార్యక్రమాలను జరగబోయే కార్యక్రమాలను గురించి వివరించారు.తదుపరి జిఎం ఎస్టిపిపి ఎం.నరసింహారావు,జీఎం(పిసిఎస్) &(ఓ&ఎం) మదన్మోహన్ ఆదేశాల మేరకు ఖాళీగా ఉన్న ప్రెసిడెంట్,వైస్ ప్రెసిడెంట్,జాయింట్ సెక్రటరీ పదవులకు నామినేషన్ కోరడమైనది.దీనికి అధికారుల సంఘం సభ్యులందరూ సిఎంఓఎఐ ఎస్టిపిపి బ్రాంచ్ ప్రెసిడెంట్ గా డి.పంతులా ని ఏకగ్రివంగా ఎన్నుకున్నారు.వైస్ ప్రెసిడెంట్ గా జనగామ శ్రీనివాస్ ని,జాయింట్ సెక్రటరీ గా శ్యామల ని ఎన్నుకోవడం జరిగింది.అనంతరం నూతనంగా ఎన్నికైన ప్రెసిడెంట్ ధారావత్ పంతులా మాట్లాడుతూ.. అధికారుల సంఘం సభ్యులకి ఎస్టిపిపి యాజమాన్యానికి ప్రత్యెక ధన్యవాదాలు తెలుపుతూ రాబోయే కాలంలో అందరి సహాయ,సహకారాలతో సెంట్రల్ కమిటి సభ్యులతో,యాజమాన్యాన్ని సమన్వయ పరుస్తూ పెండింగ్ లో ఉన్న పనులను, ఉద్యోగులకు సంబంధించిన సమస్యలను సాధించుకోవడానికి తనవంతు కృషి చేస్తానని తెలియజేసారు.ఈ కార్యక్రమానికి ఎస్టీపీపీ ఈడి సిహెచ్.చిరంజీవి,జిఎం ఎస్టిపిపి ఎం.నరసింహారావు,జీఎం(పిసిఎస్) & (ఓ&ఎం)మదన్మోహన్,ఏజిఎం (ఫైనాన్స్)మురళీధర్,డిజిఎం (సివిల్) ఆజాజుల్లా ఖాన్,డీజీఎం(పర్సనల్),డి కిరణ్ బాబు,కార్యవర్గ సభ్యులు డి.పంతులా,సంతోష్ కుమార్,జనగామ శ్రీనివాస్,అప్పారావు,రమేష్,శ్యామల,మోబిన్ పాల్గొన్నారు.
