DEO Rajender Felicitates School Athletes
పాఠశాల క్రీడాకారులను అభినందించిన డి. ఇ. ఓ
మహాదేవపూర్ నేటి ధాత్రి *
మహాదేవపూర్ మండల కేంద్రంలోని జెడ్ పి హెచ్ ఎస్ బాలికల పాఠశాలను బుధవారం నాడు సందర్శించారు. ఇందులో భాగంగా ఇటీవల స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ క్రీడలలో మండల ,జిల్లా, ఉమ్మడి వరంగల్ జిల్లాస్థాయిలలో ఆడిన క్రీడాకారులను డి .ఇ. ఓ. రాజేందర్ అభినందించారు.డి.ఇ. ఒ మాట్లాడుతూ బాలికల పాఠశాల విద్యార్థులు జాతీయస్థాయిలో రాణించాలని ఆకాంక్షించారు .రాష్ట్రస్థాయికి ఎంపిక అయినా క్రీడాకారులను అభినందించారు. పాఠశాల విద్యార్థుల క్రీడాభివృద్ధికి ఉదయం ,సాయంత్రం మెలుకువలు నేర్పుతూ విశేష కృషి చేస్తున్న ఆ పాఠశాల పీడి గురుసింగా పూర్ణిమను జిల్లా విద్యాధికారి మరియు పాఠశాల ప్రధానోపాధ్యాయు లు
అభినందించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు జి .శ్రీనివాస్ రెడ్డి మరియు ఎం ఇ.ఓ ప్రకాష్ బాబు , పేట సంఘం అధ్యక్షులు సిరంగి రమేష్ పాఠశాల, ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.
