
నేటిధాత్రి కమలాపూర్(హన్మకొండ)
హుజురాబాద్ నియోజకవర్గం లోని కమలాపూర్ మండల పరిధిలో గల కానిపర్తి,శంభునిపల్లి,గూడూరు తదితర ఆరు గ్రామాల రైతులకు మంత్రి పొన్నం చొరవతో సాగు నీరు సౌకర్యం కలిగిందని కాంగ్రెస్ పార్టీ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు బాలసాని రమేష్ గౌడ్ తెలిపారు.గత కొద్ది రోజులుగా ఆయా గ్రామాల రైతులు సాగు నీరు అందక ఇబ్బంది పడుతున్నారని,వారి సమస్యను కాంగ్రెస్ పార్టీ హుజురాబాద్ ఇన్చార్జి ఓడితెల ప్రణవ్ దృష్టికి తీసుకుెళ్లగా ఆయన మంత్రి పొన్నం ప్రభాకర్ కు రైతుల సమస్యను వివరించినట్లు తెలిపారు.దీనితో మంత్రి స్పందించి ఎస్ఆర్ఎస్పి అధికారులతో మాట్లాడి రైతులకు సాగు నీరు సరఫరా ను పునరుద్ధరించారు అని తెలిపారు.సాగు నీటి సమస్యను పరిష్కారానికి కృషి చేసిన మంత్రికి మరియు నియోజక వర్గ ఇన్చార్జి ప్రణవ్ బాబుకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు.