#జిల్లా వ్యవసాయ అధికారి కే అనురాధ.
నల్లబెల్లి నేటి ధాత్రి: సాగు చేసే భూమికే రైతు భరోసా అందివ్వడం జరుగుతుందని జిల్లా వ్యవసాయ అధికారి కే అనురాధ పేర్కొన్నారు సోమవారం మండలంలోని దస్తగిరి పల్లె, రుద్రగూడెం గ్రామంలో పలు భూములను ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు అనంతరం ఆమె మాట్లాడుతూ వ్యవసాయ సాగు చేసే భూములకే రైతు భరోసా ఇవ్వడం జరుగుతుందని ఎలాంటి వ్యాపార లావాదేవీలు చేసే గోదాములకు కానీ, ఇటుక బటీలకు గాని, ఇండ్లకు రైతు భరోసా వర్తించదని ఆమె పలువురి రైతులకు సూచించారు ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి రజిత, విస్తరణ అధికారులు శివకుమార్, విశ్వభాను, రెవిన్యూ అధికారులు, పంచాయతి కార్యదర్సులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.