సాయం కోసం ఎదురు చూపు
ప్రభుత్వమే నష్టపరిహారం అందించాలి
శాయంపేట నేటి ధాత్రి,
శాయంపేట మండల కేంద్రంలో కళ్ళముందు పంటలు ఎండిపోతున్నాయి. సాగుదల చేస్తున్న కౌలు రైతులు పంటలు వేసి అనేక మంది రైతులు నష్టపోయారు ఆరుగాలం శ్రమించి పంటలు పండించేందుకు అనేక ప్రయత్నాలు చేసిన సాగునీరు అందక రైతులు పరిస్థితి దయహినంగా మారింది. ఈ తరుణంలో మమ్మల్ని ప్రభుత్వం ఆదుకోవాలంటూ సర్కార్లను రైతులు వేడుకుంటున్నారు గత పదిహేనులుగా వ్యవసాయం పండగలగా మారింది. ఈ ఏడాది నుంచి రైతులను కష్టాలు వెంటాడుతున్నాయి. భూగర్భ జలాలు రోజురోజుకు తగ్గిపోతుంది వేసిన మొక్కజొన్న పంటలు ఎండిపోతున్నాయి కనీసం మొక్కజొన్న పాలు పోసుకొని దశలో నిలువుతా ఎండి పోతుంది. వ్యవసాయం చేసి అప్పులను ఎలా కట్టాలో తీర్చలేక అర్థం కాని పరిస్థితి నెలకొంది. రుణాలు ఇచ్చే వ్యవసాయ బాకీలను వెంటాడుతున్న క్రమంలో యా సంగి పంటను వేసి బాకీలు తీర్చాలనుకున్నాం కానీ రైతన్నలు కళ్ళ ఎదుట ఎండిపోతున్న పంటలు చూసి దుఃఖిస్తున్నారు. మండల కేంద్రంలో ఎస్సారెస్పీ కాలువ ఆధారంగా 500 ఎకరాలు పూర్తిగా ఎండిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో అధిక మొత్తంలో రైతులు పాల్గొన్నారు
పంటలు ఎండిపోయాయి
శాయంపేట రైతు సతీష్, మురళి ,రవీందర్ రెడ్డి మొదలగు 50 ఎకరాల భూమిలో మొక్కజొన్న ఎస్సారెస్పీ కాలువ ఆధారంగా సాగుదల చేశారు. కానీ కాలువ రాకపోవడంతో కంకి పి చుదశలో దశలో నీళ్లు అందక ఎండిపోతున్నది. భూమిని కవులు కాబట్టి సాగుదల చేస్తున్న కౌలు రైతుల ఆవేదన మమ్మల్ని ప్రభుత్వమే ఆదుకోవాలి.