
హుజురాబాద్ :నేటిధాత్రి
బిఎన్ఎస్ యాక్టులో కేసు నమోదు అయిన మొట్టమొదటి ఎమ్మెల్యే
నిన్న జడ్పీ సమావేశంలో ఎమ్మెల్యే వ్యవహారించిన తీరుపై జెడ్పీ సఈవో ఫిర్యాదు చేయగా కొత్త చట్టం ప్రకారం ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పై క్రిమినల్ కేసు నమోదు అయింది. కలెక్టర్ పమేలా సత్పతి బయటికి వెళ్ళే సమయంలో ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అడ్డుకుని బైఠాయించారు. దీంతో అధికారుల విధులకు ఆటకం కలిగించారని ఆరోపిస్తూ స్థానిక వన్ టౌన్ పోలీసులకు జడ్పీ సీఈవో నిన్న రాత్రి ఫిర్యాదు చేయడంతో భారత్ న్యాయ్ సంహిత యాక్ట్ ప్రకారం సెక్షన్ 221,126 (2} కేసు నమోదు చేశారు. బిఎన్ఎస్ చట్టం అమలులోకి వచ్చిన రెండవ రోజే కౌశిక్ రెడ్డి పై క్రిమినల్ కేసు నమోదు కావడం అందులో ఎమ్మెల్యే పై మొట్టమొదటి కేసు నమోదు కావడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం కలిగిస్తుంది. అయితే వీరంతా జిల్లాకు చెందిన మంత్రి ఒత్తిడి ఉన్నట్లుగా ప్రచారం జరుగుతుంది ఏది ఏమైనా ఒక ఎమ్మెల్యే పై అధికారులు కేసు పెట్టే సాహసం చేయడం చర్చనీయ అంశంగా మారింది.