పరకాల నేటిధాత్రి
పేదలు,కార్మికులు, ఉద్యోగులు,కష్టజీవుల హక్కుల కోసం నిరంతరం పోరాటం చేస్తున్న సిపిఎం హనుమకొండ జిల్లా రెండవ, మహాసభలు డిసెంబర్ 14, 15వ,తేదీలలో హసన్పర్తి లో జరుగుతున్నాయని, వాటిని జయప్రదం చేయాలని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు డి. తిరుపతి పిలుపునిచ్చారు.పరకాల అమర దామంలో సిపిఎం మహాసభల కరపత్రాలు విడుదల చేశారు.
ఈ సందర్భంగా తిరుపతి మాట్లాడారు.జిల్లాలోని ఆర్థిక, రాజకీయ,సామాజిక అంశాలు, కార్మికులు,కర్షకులు పేదలు మహిళలు తదితర ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను చర్చించి జిల్లా సమగ్ర అభివృద్ధి కోసం భవిష్యత్తు కార్యచరణ రూపొందించడం కోసం ఈ మహాసభలు జరుగుతున్నాయని తెలిపారు.
కేంద్రంలో బిజెపి గత పది సంవత్సరాలుగా అనుసరిస్తున్న నయా ఉదారవాద ఆర్థిక విధానాలు పారిశ్రామిక రంగాన్ని వ్యవసాయ రంగాన్ని దివాళ తీశాయి.విద్య వైద్యం సామాన్యులకు అందని ద్రాక్షగా మారింది ఆర్థిక అసమానతలు పెద్ద ఎత్తున పెరిగాయి.ప్రజలు చెమటోర్చి నిర్మించిన ప్రభుత్వ రంగ సంస్థలను కేంద్ర ప్రభుత్వం అంబానీ, ఆదాని లాంటి బడా కార్పొరేట్ సంస్థలకు కారు చౌకగా కట్టబడుతుంది.దేశంలో ప్రజాస్వామ్యం,ప్రజల హక్కులు,రాష్ట్రాల హక్కులపై రాజ్యాంగం పై దాడి చేస్తుంది. దేశ సంపదను కొల్లగొడుతూ పెట్రోల్,డీజిల్,గ్యాస్ నిత్యవసర వస్తువుల ధరలు పెంచి భారం మోపుతుందని, అన్నారు. రాష్ట్రంలో ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు అమలుకై ఉద్యమాలకు ప్రజలను సిద్ధం చేసేందుకు కోసం జరుగుతున్న మహాసభలను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు మడికొండ ప్రశాంత్,ఓర్సు చిరంజీవి, మాటూరు సతీష్,బి.నిఖిల్ లు పాల్గొన్నారు.