దేశ వ్యాప్త సమ్మె బంద్ కు సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ సంపూర్ణ మద్దతు

న్యూడెమోక్రసీ -ఎఐకెఎంఎస్ ఆధ్వర్యంలో శెట్టుపల్లి గ్రామంలో ట్రాక్టర్స్ తో భారీ ర్యాలీ

గుండాల(భద్రాద్రికొత్తగూడెం జిల్లా),నేటిధాత్రి :
ఫిబ్రవరి16న దేశ వ్యాప్త సమ్మెను జయప్రదం చేయండి న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఆవునూరి మధు
బందు సమ్మెకు ఎఐకెఎంఎస్ మండల కార్యదర్శి బచ్చాల సారయ్య అధ్యక్షత వహించగా న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఆవునూరీ మధు మాట్లాడుతూ
చాయ్ వాళ దేశ ప్రధాని మోడీ చాయిని అమ్మినట్టు దేశంలో ఉన్న ప్రభుత్వ రంగా సంస్థలు సహజవనులను కేంద్ర ప్రభుత్వం కార్పొరేటర్పరం చేస్తున్నది వ్యూహాత్మక అమ్మకాల పేరుతో ప్రభుత్వ రంగసంస్థల్లో 100% వాటాలు తెగ నమ్ముతున్నది నేషనల్ మాని టైజేషన్ పైప్ లైన్ (ఎన్ఎంపి) పాలసీ ద్వారా మౌలిక వసతులను లీజు పేరుతో ప్రైవేటీకరిస్తున్నది.ఉద్యోగుల కష్టార్జితమైన పిఎఫ్ పెన్షన్ నిధులను ప్రైవేట్ ఇన్సూరెన్స్ మ్యూచువల్ ఫండ్ సంస్థలకు కట్టబెడుతున్నది.సింగరేణిలోని నాలుగు బొగ్గు గనులను వేయడానికి విశ్వప్రయత్నం చేస్తున్నది.కార్మికులు మధ్యతరగతి ప్రజల్లో అత్యధికులు పాలసీదారులుగా ఉన్న ఎల్ఐసి వాటాలను అమ్మేందుకు తెగబడింది.కార్పొరేట్లు ఎగ్గొట్టిన రుణాలతో ప్రభుత్వంగా బ్యాంకులను నిర్వీర్యం చేస్తున్నది, ఈ విధానాలు ఉద్యోగుల భద్రతతో పాటు దేశ ఆర్థిక స్వాలంబనకే ముప్పు తెస్తున్నాయి.అనేక త్యాగాలతో పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను రద్దుచేసి వాటి స్థానంలో నాలుగు లేబర్ కోడ్ లను తెచ్చింది,కనీస వేతనాలు నిర్ణయించే విధానానికి స్వస్తి పలికింది సమ్మె హక్కును కాలరాస్తున్నది, పిఎఫ్ ఈఎస్ఐ వెల్ఫేర్ బోర్డులను నిర్వీర్యం చేస్తున్నది తిరిగి 12 గంటల పని విధానం అమలోకి తెస్తున్నదికాంట్రాక్టు లేబర్ విధానం అన్ని రంగాల్లో మరింతపెంచిశ్రమదోపిడికి గురి చేస్తున్నది.కనీస వేతనం నెలకు 26,000 నిర్ణయించేందుకు బిజెపి ప్రభుత్వం అంగీకరించడం లేదు కోట్లాదిమంది కార్మికులకు వర్తించే ఈపిఎస్ పెన్షన్ నెలకు పదివేలకు పెంపు సిపిఎస్ ని రద్దుచేసి పాత పెన్షన్ ఓపీఎస్ ను పునరుద్ధరణ వ్యతిరేకిస్తున్నది.కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఎనిమిదవ పే కమిషన్ నియమించకుండా జాప్యం చేస్తున్నదని అన్నారు. దీనికి వ్యతిరేకంగా ఫిబ్రవరి 16 2024న
కార్మికులు ఐక్యంగా పాల్గొని సమ్మెను విజయవంతం చేయాలని సంఘటిత అసంఘటిత రంగ కార్మిక వర్గానికి పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో న్యూడెమోక్రసీ జిల్లా నాయకులు అరెం నరేష్ నాయకులు మల్యాల మల్లేష్ , పునెం శ్రీను, కస్నాబోయిన లింగన్న,ఉపేందర్, కల్తీ మల్లయ్య,తప్పెట్లా రాములు,జనగాం వాసు,కల్తీ, బొర్రయ్య, పి డి ఎస్ యు జిల్లా కార్యదర్శి ఇర్పా రాజేష్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!