
పార్టీ రాష్ట్ర నేతలు గుమ్మడి, రాయల, నాయిని
గుండాల(భద్రాద్రికొత్తగూడెం జిల్లా),నేటిధాత్రి :
గుండాలమండల పరిధిలోని పోతిరెడ్డిగూడెం గ్రామంలో 21 కుటుంబాలు, 60 మంది ప్రజలు సిపిఐ (ఎంఎల్) న్యూ డెమోక్రసీ నుండి సిపిఐ(ఎంఎల్) మాస్ లైన్( ప్రజాపందా) పార్టీలో మంగళవారం చేరారు. పోతిరెడ్డిగూడెం గ్రామ సీనియర్ నాయకులు పూనెం లక్ష్మయ్య, వూకె శ్రావణ్, ఈసం లక్ష్మీనారాయణ, పూనెం చలపతిరావు, పూనెం ప్రభాకర్, వాగబోయిన సారయ్య, వాగబోయిన మోహన్ రావు, ఊకే వెంకన్న, మోకాళ్ళ పోతయ్య, పూనెం అలివేందర్, ఈసం చిన్న నారాయణ, ఈసం నర్సింహారావు, ఎట్టి నర్సయ్య, వాగబోయిన శ్రీను, అరెం చంద్రయ్య,అరెం మంగయ్య, పూనెం పుష్పలత, మోకాళ్ళ లక్ష్మయ్య, వాగబోయిన శ్రీవేణి, ఈసం ప్రభాకర్, మోకాళ్ళ స్వాతి, మోకాళ్ళ సునీత లను సిపిఐ (ఎంఎల్) మాస్ లైన్( ప్రజాపందా) పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. గుండాల మండల పరిధిలోనే ఎంతో అనుభవం కలిగిన ఈ గ్రామ ప్రజలు సిపిఐ(ఎంఎల్) మాస్ లైన్ (ప్రజాపందా) లో చేరడం వర్గ పోరాటాల నిర్మాణ బలోపేతానికి ఉపయోగపడుతుందని అన్నారు.
ఈ సందర్భంగా సిపిఐ (ఎంఎల్) మాస్ లైన్ ప్రజా పంథా పార్టీ గుండాల మండల కార్యదర్శి కొమరం శాంతయ్య అధ్యక్షతన జరిగిన సభలో ఆ పార్టీ రాష్ట్ర నాయకులు గుమ్మడి నర్సయ్య, రాయల చంద్రశేఖర్, నాయిని రాజు లు మాట్లాడుతూ దేశంలో పేదలు మరింత పేదలుగా మారుతున్నారని, ధనవంతులు మరింత ధనవంతులు అవుతున్నారని దీనికి కారణం పెట్టుబడి దారి సమాజం అన్నారు. నిరుద్యోగం, అణిచివేత ఒకవైపు ఉంటే సంపద గుట్టలు, గుట్టలుగా మరోవైపు ప్రొగు అవుతుందన్నారు. మూఢనమ్మకాలు, కుల, మత, ప్రాంతీయ వివక్షలను పాలకులు పెంచి పోషిస్తున్నారని, శ్రామిక వర్గం సంగటితం కావలసిన అవసరం ఉందన్నారు. వర్గ పోరాటాలు నిర్వహించాల్సిన పార్టీలు, శక్తులు ,వ్యక్తులు సంఘటితం కావాలని తెలిపారు. దేశవ్యాప్తంగా ఉండే విప్లవ పార్టీలు కలిసి ఉండవలసిన అవసరం గుర్తించి, సిపిఐ(ఎంఎల్) ప్రజా పందా, సిపిఐ(ఎంఎల్) ఆర్ ఐ, పి సి సి సిపిఐ (ఎంఎల్) పార్టీలు విలీనం అవ్వాలని నిర్ణయించుకొని విలీన భారీ బహిరంగ సభ 2024 మార్చి 3 తేదీన ఖమ్మం జిల్లా కేంద్రంలో 20వేల మందితో నిర్వహిస్తున్నామని తెలిపారు. మార్చి 4, 5 తేదీలలో జాతీయ మహాసభలు 300 మంది ప్రతినిధులతో ఖమ్మం పట్టణంలో జరుగుతాయని వారన్నారు. ఈ సభల విజయవంతానికి ప్రజలు భారీగా తరలి రావాలని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఐ ( ఎంఎల్) మాస్ లైన్ ( ప్రజాప్రందా) ఇల్లందు డివిజన్ కార్యదర్శి ఈసం శంకర్, పార్టీ జిల్లా నాయకులు వాంకుడోత్ అజయ్, మాచర్ల సత్యం, పార్టీ డివిజన్, మండల నాయకులు ఆవుల కిరణ్, పాయం వెంకన్న, బోర్ర వెంకన్న, మోకాళ్ళ ఆజాద్, యనగంటి గణేష్,పూనెం మంగయ్య, తెల్లం రాజు, సనప కుమార్, కోడూరి జగన్, ఈసం కృష్ణ, ఈసం సమ్మయ్య, ఈసం సింగన్న, మోకాళ్ళ పాపారావు, కుంజ నరేష్, పూనెం కృష్ణ, గట్టి సురేష్, పూనెం సతీష్, పూనెం సుధాకర్, ధరావత్ వాగ్య, ధరావత్ మోహన్, లూనావత్ శంకర్, గుండాల మాజీ ఉపసర్పంచ్ ధరావత్ ఆల్యా, లాలయ్య తదితరులు పాల్గొన్నారు.