కేంద్ర బడ్జెట్ పత్రాలను తగలబెట్టిన సిపిఐ నాయకులు

కేంద్ర బడ్జెట్ లో తెలంగాణ రాష్టానికి తీవ్ర అన్యాయం.

సీపీఐ పట్టణ కార్యదర్శి సోతుకు. ప్రవీణ్ కుమార్

భూపాలపల్లి నేటిధాత్రి

భూపాలపల్లి పట్టణం లోని కారల్ మార్క్స్ కాలనిలో సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ లో తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం చేశారని బడ్జెట్ పత్రాలను తగలపెట్టి నిరసన తెలపడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఐ పట్టణ కార్యదర్శి సోతుకు.ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తెలంగాణ రాష్ట్రానికి అనేక హామీలు ఇవ్వడం జరిగిందని, తెలంగాణ రాష్ట్రంలో ఎనమిది మంది ఎంపీలు, ఎనమిది మంది ఎమ్మెల్యేలు వుండి ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్నప్పటికీ బడ్జెట్లో తెలంగాణ రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేయడం జరిగిందన్నారు.కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతన్ సుమారు రెండు గంటల పాటు మాట్లాడినప్పటికీ ఒక్క మాట కూడా తెలంగాణ రాష్ట్రం పేరు ప్రసంగించలేదు అని అన్నారు. విభజన సమయంలో ఇచ్చిన హామీలను కూడా నెరవేర్చలేదని అన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా కు తీవ్ర అన్యాయం జరిగిందని రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం ఉక్కు పరిశ్రమకు, ములుగులో గిరిజన యూనివర్సిటీకి నిధులు కేటాయించకపోవడం చాలా సిగ్గుచేటు అని అన్నారు. వ్యవసారంగానికి,విద్యారంగానికి, పరిశ్రమలకు, ఇతర వాటికి అధిక నిధులు కేటాయించకపోవడం చాలా దారుణమని అన్నారు. తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం చేసిన బిజెపి పార్టీకి ఎంపీలు వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ రంగ సంస్థలన్నీ అంబానికి,ఆదానికి కట్టబెట్టే ప్రయత్నాలు చేస్తుందని తెలిపారు.తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం చేసిన బిజెపి ప్రభుత్వం పైన అన్ని రాజకీయ పార్టీలు పెద్ద ఎత్తున కేంద్ర ప్రభుత్వం పైన పోరాటాలు చేయాలని కోరారు. రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల్లో కేంద్ర బడ్జెట్ పైన చర్చ జరిపి తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు
ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు క్యాథరాజు సతీష్, నూకల చంద్రమౌళి, వేముల శ్రీకాంత్, ఆరబోయిన వెంకటేష్, పీక రవికాంత్, పొనగంటి లావణ్య, మరాఠీ కాంతారావు, యాకూబ్ పాషా,గోలి లావణ్య, వనిత,సంధ్య,శ్రీలత,స్వప్న,పద్మ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *