చందుర్తి, నేటిధాత్రి:
బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ తారక రామారావు పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరం లో పాల్గొన్న జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య, మాజీ ఎంపీ ఎంపీచిలక పెంటయ్య. కల్వకుంట్ల తారకరామారావు ఇలాంటి ఎన్నో పుట్టిన రోజులు సంతోషంగా జరుపుకోవాలని, అతడు ఆయురారోగ్యాలతో ఉండాలని, అతని సేవలు తెలంగాణ రాష్ట్రానికి ఎంతో అవసరమని వచ్చే ఎన్నికల్లో సత్తా చాటి తిరిగి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో రక్తదాన చేసిన పలువురు యువకులకు పండ్లు అందజేశారు.