25 వార్డులో బోర్ కి మరమ్మత్తు చేయించి నీటి సౌకర్యం కల్పించాలి
భూపాలపల్లి నేటిధాత్రి
భూపాలపల్లి మున్సిపల్ పరిధిలో ఉన్న కార్లు మార్క్స్ కాలనీ 25 వ వార్డు లో ఉన్న బోరును మరమ్మత చేయించి నీటి సౌకర్యాన్ని కల్పించాలని భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ 25వ వార్డు శాఖ సమితి ఆధ్వర్యంలో స్థానిక మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ కి వినతిపత్రం అందించడం జరిగింది
ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు క్యాతరాజు సతీష్ మాట్లాడుతూ 25వ వార్డులో నీటి సమస్య తీవ్రంగా ఉందని వేసవికాలం సమీపిస్తున్నందున నీటి కొరత లేకుండా చూడాలని అదేవిధంగా 25వ వార్డులో ఉన్న బోర్ రిపేర్ అయి మూడు రోజులు కావస్తుంది కావున దాన్ని మరమ్మత్త చేయించి నీటి సౌకర్యాన్ని కల్పించాలని కోరారు.. అంతేకాకుండా మిషన్ భగీరథ ద్వారా వచ్చే నీళ్లు సరిపడా రావడం లేదని వాటి సమయాన్ని కూడా పెంచాలని కోరారు అంతేకాకుండా కాలనీలో ఉన్న సెల్ టవర్ ను తొలగించాలని కోరారు ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ సానుకూలంగా స్పందించి వెంటనే చర్యలు తీసుకుంటానని తెలియజేయడం జరిగింది
ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా సమితి సభ్యులు నేరెళ్ల జోసెఫ్ సిపిఐ 25 వ వార్డు శాఖ సహాయ కార్యదర్శి యాకూబ్ పాషా, సిపిఐ నాయకులు మట్టి కృష్ణ, నా తర చంద్రయ్య, భాస్కర్, పాల్గొన్నారు