బండి భగీరథ అరెస్టు చేయాలి: సిపిఐ

బండి భగీరథ వెంటనే అరెస్ట్ చేయాలి

బండి సంజయ్ వెంటనే రాజీనామా చేయాలి

సిపిఐ పట్టణ కార్యదర్శి సోతుకు. ప్రవీణ్ కుమార్

భూపాలపల్లి నేటిధాత్రి

రావి నారాయణరెడ్డి భవన్‌లో భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) పట్టణ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించబడింది. ఈ సమావేశానికి సిపిఐ పట్టణ కార్యదర్శి సోతుకు. ప్రవీణ్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరైనారు
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, బీజేపీ కేంద్రమంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథపై పోక్సో చట్టం కింద కేసు నమోదైనప్పటికీ ఇప్పటివరకు పోలీసులు అరెస్ట్ చేయకపోవడం తీవ్ర అనుమానాలకు తావిస్తోందని అన్నారు. సాధారణ ప్రజల విషయంలో వేగంగా స్పందించే పోలీస్ వ్యవస్థ, అధికార పార్టీ నాయకుల కుటుంబ సభ్యుల విషయంలో మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదన్నారు.
రాజ్యాంగం ప్రకారం చట్టం అందరికీ సమానమని, అధికారంలో ఉన్నవారికోసం ప్రత్యేక నిబంధనలు ఉండవని తెలిపారు. బాధితులకు న్యాయం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై మరియు పోలీస్ శాఖపై ఉందన్నారు. పోక్సో వంటి తీవ్రమైన కేసుల్లో ఆలస్యం చేయడం వల్ల ప్రజల్లో చట్టంపై నమ్మకం తగ్గిపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు.
అదేవిధంగా మహిళలు, బాలికల రక్షణ విషయంలో ప్రభుత్వం ద్వంద్వ వైఖరి విడనాడాలని, వెంటనే బండి భగీరథను అరెస్ట్ చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కేసు విషయంలో ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లకు లోనుకాకుండా పారదర్శకంగా విచారణ జరపాలని కోరారు.సిపిఐ పార్టీ ఎప్పటికీ బాధితుల పక్షాన నిలబడుతుందని, న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని హెచ్చరించారు. ప్రభుత్వం తక్షణమే స్పందించకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని ప్రవీణ్ తెలిపారు.
ఈ సమావేశంలో సిపిఐ పట్టణ నాయకులు నేరెళ్ల జోసెఫ్, పోచంపల్లి మహేష్,గోలి లావణ్య, ఎండి సాబిర్, గోనెల తిరుపతి, ఐలీ శరత్, పల్లెల రజిత, పెద్దమంలో సంధ్య, వాసం రజిత, పోతుగంటి స్వప్న, మట్టి నాగమణి, మెండ్రపు సుభద్ర తదితరులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version