నకిలీ విత్తనాలు పట్టుకున్న సిపి టాస్క్ ఫోర్స్ పోలీసులు

జైపూర్ నేటి ధాత్రి

మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం భీమారం పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆవడం ఎక్స్ రోడ్ వద్ద సోమవారం రోజున సుమారు మూడు లక్షల ఇరవై వేల రూపాయల విలువచేసే 107 కిలోల నిషేధిత బిటి త్రీ నకిలీ పత్తి విత్తనాలు సిపి టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. వివరాల్లోకి వెళ్తే కల్తి, నకిలీ విత్తనాల అక్రమ రవాణా నిర్మూలించి అన్నదాత కు అండగా నిలవడమే లక్ష్యంగా రామగుండం పోలీస్ కమిషనరేట్ సీపీ టాస్క్ ఫోర్స్ వరుస దాడులు చేస్తున్నారు. సోమవారం రోజు నమ్మదగిన సమాచారం మేరకు సీపీ టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ సంజయ్ , ఎస్సై ఉపేందర్, భీమారం ఎస్ ఐ రాములు , భీమారం వ్యవసాయ అధికారి మార్క్ గ్లాడ్ స్టన్ మరియు టాస్క్ ఫోర్స్ సిబ్బంది లతో కలిసి మంచిర్యాల జిల్లా లోని బీమారం పోలీస్ స్టేషన్ పరిధిలోనీ ఆవడం ఎక్స్ రోడ్ వద్ద ఒక వ్యక్తి మూడు సంచులతో ఆటో కోసం ఎదురుచూస్తూ అనుమానాస్పదంగా కనిపించగా, అతనిని పట్టుకొని సంచులు తనిఖీ చేయగా ఒక క్వింటాలు ఏడు 107 కిలోల నకిలీ పత్తి విత్తనాలు లభించాయి. విచారణ చేయగా అతని పేరు చుండు నాగేశ్వరరావు అని, భీమారంలో కౌలుకు వ్యవసాయం చేస్తానని, గుంటూరు జిల్లాకు చెందిన తాను, కర్నూలులో గుర్తుతెలియని వ్యక్తి వద్ద నుంచి తక్కువ ధరకు నకిలీ పత్తి విత్తనాలు కొనుగోలు చేసి మంచిర్యాల ప్రాంతంలోని అమాయకపు రైతులకు ఎక్కువ ధరకు అమ్ముట కొరకై తీసుకువచ్చానని, ఆర్టీసీ బస్సు దిగి ఆటో కోసం ఇక్కడ ఉన్నానని తెలపడం జరిగింది. సదరు నిందితుడినీ చుండు నాగేశ్వర్ రావు తండ్రి వెంకటేశ్వర్లు, వయసు: 59, గా గుర్తించారు.తదుపరి విచారణ నిమిత్తం నిందితుడ్ని మరియు నకిలీ పత్తి విత్తనాలను స్వాదీనపర్చుకొని, భీమారం పోలీస్ వారికి అప్పగించడం జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *