వేములవాడ నేటి దాత్రి
త్వరలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా అక్రిడిటేషన్ కార్డుతో సంబంధం లేకుండా ప్రతీ ఒక్క జర్నలిస్టులకు ఎన్నికల కవరేజ్ మరియు కౌంటింగ్ కవరేజ్ పాసులు జారీ చేయాలని వేములవాడ నియోజకవర్గ నేషనల్ యూనియన్ జర్నలిస్ట్ ఆఫ్ (ఇండియా) అధ్యక్షుడు కోడం కనుకయ్య, ఆధ్వర్యంలో ప్రధాన కార్యదర్శి తాటిపల్లి నరసింహస్వామి, ఉపాధ్యక్షులు ఏనుగు శ్రీనివాస్, కోరారు. ఆదివారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో డీపీ ఆర్ ఓ మామిండ్ల దశరథంకు వినతిపత్రం అందజేశారు. 2018 ఎన్నికల్లో లోకల్ చానల్స్ నిర్వాహకులకు ఇచ్చిన మాదిరిగానే వర్కింగ్ జర్నలిస్టు అందరికీ అధికారికంగా కవరేజ్ పాసులను జారీ చేయాలని నేషనల్ యూనియన్ జర్నలిస్ట్ ఆఫ్ (ఇండియా) యూనియన్ సభ్యులు కోరారు.