
పరకాల నేటిధాత్రి(టౌన్)
ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన గృహలక్ష్మీ పథకంలో భాగంగా హనుమకొండ జిల్లా పరకాల మున్సిపాలిటీ ఏడవ వార్డులో గృహలక్ష్మి పథకానికి అర్హులైన లబ్ధిదారులకు స్థానిక వార్డు కౌన్సిలర్ నల్లెల్ల జ్యోతి అనిల్ కుమార్ లబ్ధిదారులకు ప్రోసిడింగ్స్ అందజేయడం జరిగింది.లబ్ధిదారులు సంతోషాన్ని వ్యక్తం చేస్తూ గౌరవ ఎమ్మెల్యే ధర్మారెడ్డికి కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో వార్డు అధ్యక్షులు ఉడుత సుమన్ యాదవ్,ఉపాధ్యక్షులు గునిగంటి రవి,కార్యదర్శి అడప సుధాకర్,వార్డ్ ఆఫీసర్ కడారి వేణు,వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.