కూకట్పల్లి జూన్ 12 నేటి ధాత్రి ఇంచార్జ్
124 డివిజన్ శంశిగుడా పరిధిలోని ఇంద్రహిల్స్ మరియు మహంకాళి నగర్ లోని సీసీ రోడ్ల కొరకు గతంలో యాభై లక్షల రూపాయల నిధులు మంజూరై త్వరలో నిర్మాణ పనులు మొదలుకా నున్న సీసీ రోడ్లను డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ పరిశీ లించడం జరిగింది.ఈ సందర్భంగా ఇంద్ర హిల్స్ శివాలయం జుంక్షన్ వద్ద సీసీ రోడ్డును పరిశీలించిన కార్పొరేటర్ అక్క డ వాటర్ లికేజీని గమనించి సంబంధిత అధికారులతో మాట్లాడి లీకేజీ సమస్యను పరిష్కరించాలని ఆదేశించారు.ఈ సంద ర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ ఇంద్ర హిల్స్ శివాలయం జుంక్షన్ సీసీ రోడ్డు విష యమై కాంట్రాక్టర్ సంబంధిత అధి కారుల తో మాట్లాడడం జరిగిందని అన్నారు. అతిత్వరలో నిర్మాణ పనులు మొదలు పెట్టి,జుంక్షన్ రోడ్డు పనులు నాణ్యత ప్రమాణాలతో పూర్తి చేస్తామన్నారు. నిర్మాణ పనులు పూర్తయిన తరువాత వాహనదారులు కాలనీ వాసులు ఇబ్బంది పడకుండా ప్రయాణం సాఫీగా చేయవచ్చ ని హామీ ఇచ్చారు.కార్యక్రమంలో వెంకట్ నాయక్,ఎఇ శ్రావణి,వర్క్ ఇస్పెక్టర్ రవి కుమార్, తదితరులు పాల్గొన్నారు.