కార్పొరేషన్ ‘దండ’న
వరంగల్ గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పోరేషన్ ఎదురుగా బహిరంగ మల, మూత్ర విసర్జన చేస్తున్న వ్యక్తులకు బల్దియా అధికారులు పూలమాల వేసి జరిమాన విధిస్తున్నారు. పిచ్చుక మీద బ్రహ్మాస్త్రాలుు వేస్తున్నారని నగర అభివద్ధికి మల, మూత్ర విసర్జననే అడ్డుపడిందా అని నగర ప్రజలు ప్రశ్నిస్తున్నారు. కార్పొరేషన్‌లో ప్రాంగణంలోనే ఉన్న మరుగుదొడ్లకు తాళంవేసి ఉంటే ఎక్కడికి పోవాలని, కార్పొరేషన్ అధికారుల పనితీరుపై స్థానికులు, ప్రజలు అసంతప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా కార్పోరేషన్ అధికారులు నగరాభివృద్ధిపై దృష్టి సారించాలని నగరవాసులు కోరుతున్నారు.