
Coolie’ First Half Review
సూపర్‌స్టార్ రజనీకాంత్ నటించిన, లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించిన కూలీ సినిమా మొదటి భాగం ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.
రజనీకాంత్ 50 ఏళ్ల సినీ ప్రయాణానికి ఘనత చేకూర్చే ఈ చిత్రం, కేవలం ఫ్యాన్ సర్వీస్‌గానే కాక, స్నేహం, ద్రోహం, మోసం, నమ్మకం వంటి అంశాలతో కూడిన కథను చూపిస్తోంది.
కథ ప్రారంభంలో, పోర్ట్‌లో గ్యాంగ్ హెడ్మాన్ ధయ (సౌబిన్ సాహిర్) పోలీస్ ఇన్ఫార్మర్ను గుర్తించి హతమారుస్తాడు. ఇక్కడికి దూరంగా, మాన్షన్‌లో ప్రశాంతంగా జీవిస్తున్న దేవ (రజనీకాంత్) ప్రవేశిస్తాడు. అతని పరిచయం సింపుల్ డైలాగ్‌తోనే ఉండటం గమనార్హం.
సినిమాలో సత్యరాజ్‌తో రజనీకాంత్ స్నేహం, శృతి హాసన్‌తో అనుకోని బంధం, నాగార్జున పాత్రలో గ్రే షేడ్స్—all keep the intrigue alive. అనిరుధ్ స్వరపరచిన ‘మోనికా’, ‘పవర్‌హౌస్’ పాటలు ఉత్సాహాన్ని రెట్టింపు చేస్తున్నాయి.