Palamaner Market Development Appeal
పలమనేరు మార్కెట్ అభివృద్ధికి సహకరించండి
*సీఎం, మంత్రిని కలసి విన్నవించిన
ఏ యంసి,
చైర్మన్ రాజన్న..
పలమనేరు(నేటి ధాత్రి)
పలమనేరు వ్యవసాయ మార్కెట్ యార్డ్ అభివృద్ధికి సహకరించాలని స్థానిక శాసన సభ్యులు అమరనాథ రెడ్డి సూచన మేరకు ఏఎంసి చైర్మన్ రాజన్న ముఖ్యమంత్రి చంద్రబాబును, వ్యవసాయ శాఖా మంత్రి అచ్చెన్నాయుడును మంగళవారం సాయంత్రం కలసి విన్నవించారు. పలమనేరులో ప్రస్తుతం ఉన్న వ్యవసాయ మార్కెట్ యార్డ్ ను ఇంటిగ్రేటెడ్ మార్కెట్ గా అభివృద్ధి చేసేందుకు నిధులను మంజూరు చేసి సహకరించాలని విజయవాడలో వారిని కలసి కోరారు. ఇక్కడి మార్కెట్ లో వాహనాల రాకపోకలకు ఇబ్బంది ఉండడం కారణంగా స్థానిక రైతులు అధిక శాతం తమ వ్యవసాయ ఉత్పత్తులను కర్ణాటక మార్కెట్ కు తరలిస్తూన్నారని వివరించారు. ఇంటిగ్రేటెడ్ మోడల్ మార్కెట్ ఏర్పాటుతో చెన్నై, బెంగుళూరు నగరాలకు రైతులు తమ పంటలను ఎగుమతి చేసుకొనే వెసులుబాటు ఉంటుందని, దీంతో స్థానిక రైతులకు గిట్టుబాటు ధర పొందెందుకు అవకాశం ఉంటుందన్నారు.మరోవైపు కుప్పం – క్రిష్ణగిరి రహదారి విస్తరణ త్వరలో ఏర్పాటు కానుండడంతో పాటు రామకుప్పం మండలంలో రానున్న కార్గో విమాన సేవలతో ఇక్కడి వ్యవసాయ ఉత్పత్తులు విదేశాలకు తరలించుకోవడానికి వీలుంటుందని తెలియజేశారుకాబట్టి పలమనేరు మార్కెట్ ను అన్ని విధాలా అభివృద్ధి చేసేందుకు సహకరించాలని విన్నవించారు. దీనిపై ముఖ్యమంత్రితో పాటు మంత్రి సానుకూలంగా స్పందించినట్లు రాజన్న పేర్కొన్నారు.
